NewsOrbit
హెల్త్

మార్కెట్‌లో మ‌న‌కు అందుబాటులో ఉన్న 5 ఉత్త‌మ‌మైన ఆయుర్వేద స‌బ్బులు ఇవే..!

జ‌నాల‌కు ఇటీవ‌ల కాలంలో ఆయుర్వేదంపై న‌మ్మ‌కం బాగా పెరిగిపోయింది. అందుక‌నే ఆ ఔష‌ధాల‌కు, ఉత్ప‌త్తుల‌కు డిమాండ్ బాగా ఏర్ప‌డింది. ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను వాడ‌డం వ‌ల్ల ఎన్ని దుష్ఫ‌లితాలు క‌లుగుతున్నాయో జ‌నాల‌కు ఇప్పుడిప్పుడే బాగా అర్థ‌మ‌వుతోంది. అందుకనే కేవ‌లం మెడిసిన్ల‌నే కాదు, నిత్యం వాడే స‌బ్బుల వంటి వస్తువులను కూడా ఆయుర్వేద విధానాల్లో త‌యారు చేసిన‌వే ఉప‌యోగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మార్కెట్‌లో మ‌న‌కు ప్ర‌స్తుతం ప‌లు ఉత్త‌మ‌మైన ఆయుర్వేద సోప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఖ‌డీ నీమ్ తుల‌సి సోప్

5 best ayurvedic soaps available in market for us
 

దాదాపుగా అన్ని ర‌కాల చ‌ర్మం ఉన్న‌వారికి ఈ సోప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో వేప‌, తుల‌సి, ఇత‌ర నూనెలు ఉన్నందువ‌ల్ల ఈ సోప్ చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. యాంటీ బాక్టీరియ‌ల్ సోప్‌గా కూడా దీన్ని వాడుకోవ‌చ్చు. ఈ సోప్ ధ‌ర రూ.69గా ఉంది. రెండు, మూడు సోప్‌ల‌ను క‌లిపి తీసుకుంటే త‌క్కువకే వ‌స్తాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ సోప్‌ను కొన‌వ‌చ్చు.

2. ఆయుర్ తుల‌సి నీమ్ సోప్

ఈ స‌బ్బు యాంటీ సెప్టిక్‌, యాంటీ బాక్టీరియ‌ల్ సోప్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌ల‌ను తొల‌గిస్తుంది. ముల్తాని మిట్టి, వేప, తుల‌సి వంటి ప‌దార్థాలు ఇందులో ఉన్నాయి. అందువ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ సోప్ కూడా ఆన్ లైన్‌లో ల‌భిస్తోంది. 8 ప్యాక్‌ల‌ను రూ.200కి కొన‌వ‌చ్చు.

3. ప‌తంజ‌లి హ‌ల్ది చంద‌న్ కాంతి సోప్

చ‌ర్మాన్ని ఈ సోప్ కాంతివంతంగా మారుస్తుంది. చ‌ర్మం ఇన్ఫెక్ష‌న్ల‌కు గురి కాకుండా చూస్తుంది. మొటిమ‌లు రాకుండా ఉంటాయి. ఇందులో ప‌సుపు, చంద‌నం ఉంటాయి. అందువ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. ఆయిల్ స్కిన్ ఉండేవారికి ఈ స‌బ్బు మేలు చేస్తుంది. ఈ స‌బ్బును రూ.20 కి కొన‌వ‌చ్చు.

4. హ‌మామ్ తుల‌సి అండ్ అలోవెరా సోప్

సూక్ష్మ‌క్రిములు, కాలుష్యం బారి నుంచి ఈ సోప్ మీ చర్మాన్ని సంర‌క్షిస్తుంది. అలోవెరా, తుల‌సి, వేప గుణాలు ఉన్నందున చ‌ర్మ‌వ్యాధులు రాకుండా ఉంటాయి. చ‌ర్మం తేమ‌గా ఉంటుంది. చ‌ర్మం శుభ్రంగా మారుతుంది. అన్ని ర‌కాల చ‌ర్మాలు ఉన్న‌వారికి ఈ సోప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని ధ‌ర రూ.30గా ఉంది.

5. మార్గో నీమ్ సోప్

ఇది యాంటీ బాక్టీరియ‌ల్ సోప్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. చ‌ర్మాన్ని శుభ్రం చేసి సూక్ష్మ క్రిముల నుంచి ర‌క్షిస్తుంది. చ‌ర్మానికి కాంతిని తెస్తుంది. మొటిమ‌ల‌ను త‌గ్గిస్తుంది. చ‌ర్మాన్ని తేమ‌గా ఉంచుతుంది. ఈ స‌బ్బుకు చెందిన నాలుగు ప్యాక్‌ల‌ను రూ.180కి కొన‌వ‌చ్చు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri