Children : ఏమాత్రం మంచిది కాదు:
ఇప్పుడు ఇక ఎగ్జామ్స్ సీసన్ మొదలైంది. కాబట్టి వాటిని చక్కగా రాసేయడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
పరీక్షలకు వెళ్లేవారు ఒక క్రమపద్ధతి పాటిస్తే అది శిక్షగా లాగా ఉండదు. ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటే ఆడుతూ,పాడుతూ పరీక్షలు రాసేస్తారు. పరీక్షలకు ముందు రోజు చదవడం, లేదా 20 రోజుల ముందు చదువు ప్రారంభించడం, ఇంకా కొంతమంది అయితే ఎక్సమ్ కి వెళ్తూ దారి లో ఎగ్జామ్ కి కొన్ని నిమిషాల ముందు కూడా చదివేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు ఏమాత్రం మంచిది కాదు.దీని వలన నష్టమే కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు.
Children : రివిజన్ చేసుకునే సమయం లో:
ఎగ్జామ్స్ కోసం ఒక ప్రణాళిక వేసుకోండి. ఉదాహరణకు మార్నింగ్ ఎప్పుడు లేవాలి ఏ టైం కి ఏ సబ్జెక్టు చదవాలి.. ఎన్నింటికి తినాలి.. ఎన్నింటికి టీవీ చూడాలి. ఎన్నింటికి ఆదుకోవాలి అనే ప్రతిదీ మీరు నోట్ చేసుకుని ఒక చోటా అంటించుకుని ఆ విధంగా చేయడం మంచిది. ప్రతి సబ్జెక్టు లో ప్రతి పాఠానికి ముఖ్యమైన పాయింట్స్ ని ఒక చిన్న కార్డు మీద స్వయం గా రాసి ఆ పాటల దగ్గర అంటించు కుంటే రివిజన్ చేసుకునే సమయం లో అవి బాగా ఉపయోగపడతాయి.ప్రతి సబ్జెక్టు ని ఒక ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం దానికి పెట్టుకున్న సమయం లోనే చదువుకోవాలి. పరీక్షల ప్రిపరేషన్ కోసం యూట్యూబ్‌కు వెళ్తే అన్ని సబ్జక్ట్స్ మీద లక్షలాది వీడియోలు అందుబాటులో ఉన్నాయి. పరీక్షల సమయంలో కాకుండా చాలా ముందునుంచే వాటికి కూడా సమయం కేటాయించి సబ్జెక్టు కి సంబందించి అర్ధం కానీ విషయాలను అర్ధం అయ్యేవరకు యూట్యూబ్ వీడియోలలో చూసి ప్రిపేర్ అవ్వవచ్చు . కొన్ని ఆన్లైన్ టెస్టులు రాయడం వల్ల మంచి ఉత్తమ ఫలితం ఉంటుంది.
మీకు మీరే ఎగ్జామ్ పెట్టుకుని :
మీకు మీరే ఎగ్జామ్ పెట్టుకుని సమయానికల్లా ముగించడం ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది మీకు ఎక్సమ్ రాసేటప్పుడు బాగా పనిచేస్తుంది. మీరు ఎక్సమ్ కి తీసుకుని వెళ్లే ప్రతి పెన్ను మీరు కాసేపు ప్రిపరేషన్ కోసం వాడినది అయిఉండాలి. ఇది మీకు ఒక ప్లస్ పాయింట్ అని మరువకండి. కేవలం చదువు మాత్రమే కాదు.. ప్రతి రోజూ కనీసం ఆరు నుండి 8 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. కాసేపు విశ్రాంతి, ఆటవిడుపు తప్పని సరి కాబట్టి వీటిలో దేనిని విస్మరించాల్సిన పని లేదు. అలా అని ఆటలాడుతులో , టీవీ చూస్తునో , సెల్‌ఫోన్ తోనో ఉండి పోకుండా మీ టైం ప్రకారం అన్ని చేసుకోవాలి.