భయంకరమైన ఆరోగ్య సమస్యలకి, కారణమయ్యే కొలెస్ట్రాల్‌ని ఎదుర్కొనే శక్తి బీన్సులో పుష్కలంగా ఉందని, బీన్సులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే. గ్రీన్ బీన్స్ లో ఉండే అమినో ఆసిడ్స్, మన డైట్ కు చాలా అవసరం అవుతాయి. అంతే కాదు మాంసాహారం, గుడ్లు, చేపలు, డైరీ ప్రోడక్ట్స్ లో ఉండే అమినో యాసిడ్స్ కంటే ఇందులో ఎక్కువగా ఉంటాయి.ఒక కప్పు ఉడికించిన బీన్స్ తీసుకుంటే, పదిశాతం కొలెస్ట్రాల్ తగిపోతుందట. ఇది సరదాగా చెప్పిన లెక్క కాదు. కొంతమంది పరిశోధకులు, అనేక మందిపై పరిశోధనలు జరిపిన తర్వాత చెప్పిన మాట.
వారంలో నాలుగు రోజుల పాటు మన ఆహారంలో, బీన్స్‌ని చేర్చి తినడం వల్ల గుండెనొప్పి వంటి సమస్యలు దాదాపు 70 శాతం వరకూ తగ్గుతాయట. గ్రీన్ బీన్స్ లో విటమిన్స్, ప్రొటీన్స్, మినిరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ పుష్కలం గా ఉన్నాయి. అంతే కాదు డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంది. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వెజిటేరియన్ లవర్స్ వారి రెగ్యులర్ డైట్ లో బీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ఇక బరువు తగ్గాలనుకునేవారికి ఈ బీన్స్ బ్రహ్మాస్త్రంగా పనిచేస్తాయట. ఇందులో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండడం వల్ల శరీరంలోని కొవ్వు మొత్తం పూర్తిగా కరిగిపోతుందట. అందుకే వీటిని ఎక్కువగా తినాలని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుందని చెబుతున్నారు. శరీర పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి , ప్రోటీన్స్ ఎక్కువ అవసరం. బీన్స్ ప్రోటీన్స్‌కు మూలాధారం అవటం వలన , ప్రోటీన్ బాగా కావాలి అనుకునే వారికీ , శాఖాహారులకు ఇది మంచి ఆహారం. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. రక్తంలోని గ్లోకోజ్ స్ధాయిలను నిర్ధిష్టంగా ఉంచుతుంది. బీన్స్‌లో ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉండటం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.