break off: మీరు గత ప్రేమ విఫలం అయింది అనే బాధలో ఉన్నప్పుడు, ఆ జ్ఞాపకాల నుంచి బయటపడొచ్చు అనే ఆలోచన తో కొత్త బంధంలోకి అడుగుపెట్టకుండా ఉండడం మాత్రం అన్ని విధాలా మీకు మంచిది. ఎందుకంటే మీకున్న మీ అభద్రతా భావం తో మీ భాగస్వామి విపరీతమైన బాధకు గురవుతారు. కాబట్టి మీరు పాత విషయాలు,వ్యక్తులను పూర్తిగా మరిచి పోయి ఆనందం గా ఉన్నప్పుడే మరొక కొత్త బంధం లో కి ప్రవేశించండి.మీరు విఫలమైన పేమ తాలూకా బాధల నుంచి బయటకు పాడటానికి కావలసినంత టైం తీసుకుని మనస్సుకు నెమ్మదిగా సర్ది చెప్పుకోవాలి.
మీకు బాగా నచ్చిన,ఇష్టమైన పనులతో సమయాన్ని గడపాలి. ముందు మిమ్మల్ని మీరు అర్ధం చేసుకోండి, ప్రేమించుకోండి. జీవితం లో మీరు ఏమి కోరుకుంటున్నారు ? ఎలా ఉంటే సంతోషంగా ఉంటారు? ఇలాంటి వాటి గురించి ఆలోచించండి. మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు అనేది మీకు తప్ప ఎవరికి తెలియదు అని గమనించండి. గతం తాలూకు జ్ఞాపకాలు బాధిస్తున్నాయి అని వాటి నుంచి బయటపడాలని వేగంగా కొత్త బంధాలను ఆహ్వానించకూడదు.
అలా చేయటం వలన అటు పాత వ్యక్తి ని పూర్తిగా మరిచి పోలేక, ఇటు కొత్త వ్యక్తి ని పూర్తిగా అర్ధం చేసుకోలేక ఒక అయోమయ పరిస్థితి ఏర్పడటం తో పాటు… మిమ్మల్ని నమ్ముకుని కోటి ఆశలతో మీ జీవితం లో కి వచ్చిన వ్యక్తి జీవితం కూడ అయోమయం గా మారిపోతుంది.తొందర పాటు నిర్ణయాలతో వేరొకరి జీవితం పాడు చేసే హక్కు ఎవరికీ ఉండదు. మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారో బాగా అలోచించి, సమయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేయండి. అప్పుడు మీ జీవితాల్లో వెలుగులు మొదలవుతాయి.