మన అందరికి కొబ్బరికాయ గురించి తెలిసే ఉంటుంది.కొబ్బరి నీళ్లు తాగడానికి ఎంత రుచికరంగా ఉంటాయో కొబ్బరి కూడా తినడానికి అంతే రుచికరంగా ఉంటుంది.అలాగే కొబ్బరిలో బెల్లాన్ని కలిపి తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కొబ్బరి,బెల్లంలో మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవే కాకుండా ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దగ్గు, జలుబు నివారణ:
చాలా మంది కొబ్బరి తింటే దగ్గు వస్తుంది అని అనుకుంటారు. కానీ ఇలా బెల్లం, కొబ్బరిను కలిపి తినడం వల్ల దగ్గు, జలుబు సమస్యలు దూరం అవుతాయి. అలాగే గోరు వెచ్చని నీటిలో కొంచెం బెల్లం వేసుకుని తాగినా లేదంటే టీ లో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వేసి తాగినా శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
బరువు తగ్గడంలో కొబ్బరి, బెల్లం యొక్క పాత్ర :
కొబ్బరి,బెల్లంను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.అలాగే ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది.కొబ్బరి, బెల్లం కలిపి తింటే బరువు సులభంగా తగ్గుతారు.కొబ్బరి, బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు శరీరంలో నీరు అవసరమైన దానికంటే ఎక్కువగా నిల్వ లేకుండా చేస్తుంది.
కీళ్ల నొప్పులను తగ్గించడంలో :
కొబ్బరి, బెల్లంలో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నవారు కూడా ఈ రెండిటిని కలిపి తింటే అవి కూడా తగ్గిపోతాయి.
గర్భిణులకు ఉపయోగకరం :
గర్భంతో ఉన్న ఆడవారు కొబ్బరి , బెల్లాన్ని తినడం వల్ల పిండంపై చెడు ప్రభావం తగ్గుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు వేరే ఇతర అనారోగ్యాలు రాకుండా కాపాడతాయి. అందుకే గర్భిణులు కొబ్బరి,బెల్లాన్ని ఏడో నెల నుంచి తీసుకుంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. అలాగే మైగ్రేన్ ఉన్న వారు కొబ్బరి , బెల్లాన్ని కలిపి తింటే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.అలాగే కొబ్బరి , బెల్లంలో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి అలసటగా ఉన్నప్పుడు కొబ్బరి, బెల్లాన్ని తింటే తక్షణ శక్తి లభిస్తుంది.