Slate Pencil Eating Benefits: మనం కొంత మందిలో వింత అలవాట్లను చూస్తూఉంటాము. కొంత మంది పచ్చి బియ్యం తింటు ఉంటారు. కొందరు మట్టి ని తింటారు. అలాగే కొంతమందికి చాక్ పీసులు , బలపాలు తినాలనిపిస్తుంటుంది. ఇది ఒక సమస్య. ఇలా బలపాలు, చాక్ పీసులు తినడం వలన పీకా అనే సమస్య ఉన్నట్లు గుర్తించాలి . దీనికి గనుక సరిగ్గా చికిత్స తీసుకోకపోతే భవిష్యత్‌లో అది అజీర్ణ సమస్యలకు దారి తీసి అనేక జీర్ణ సమస్యలను తెస్తుంది . కొందరు చిన్న పిల్లలు నోట్లో వేలు వేసుకుంటారు. ఇవి ఒక రకమైన కంపల్సివ్ డిసార్డర్ అని చెప్పాలి. పీకా సమస్య ఉన్నవారికి మట్టీ, చాక్ పీసులు, ఐస్ వంటి వాటిని చూడగానే నోరూరిపోతుంటుంది. ఇది ఒక రుగ్మత గా చెప్పొచ్చు. పోషకాహార లోపం తో బాధపడుతున్నవారూ, గర్భిణీ స్రీలు కూడా ఇలా తింటారు. ఒక్కోసారి శరీరంలో అవసరమైనంత జింక్ లేకపోయినా కూడా ఈ పీకా వస్తుంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి.
రెండేళ్ళ లోపు పిల్లలు చాక్ కానీ మట్టి కానీ తింటుంటే దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ వయసు లో వాళ్ళకి అది సహజమే. ఏది తినచ్చు, ఏది తినకూడదు అని వాళ్ళకి తెలీదు కాబట్టి అది పీకా అవ్వదు. పీకా ఉందా లేదా అని నిర్ధారణ చేయడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎంత కాలంగా చాక్ తింటున్నారు, ఎప్పుడెప్పుడు తింటున్నారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా వంటి ప్రశ్నలు అడుగుతారు. ఒకవేళ అలవాటుగా చాక్ తింటున్నట్టు తేలితే వెంటనే రక్త పరీక్షలు చేయిస్తారు. దీని వల్ల శరీరంలో పేరుకొని ఉన్న రసాయనాలు , లెడ్, రక్తలేమి వంటివి తెలుస్తాయి. ఒకవేళ ఎవరికైనా మట్టి తినే అలవాటు ఉంటే మోషన్ శాంపిల్ టెస్ట్ చేస్తారు. దీని వల్ల కడుపులో పురుగులు ఉన్నాయా లేదా తెలుస్తుంది
గర్భిణీ గానీ, పాలిచ్చే తల్లులు కానీ వీటిని తింటే దాని వల్ల వచ్చే నష్టాలు వేరేలా ఉంటాయి. వారికి సరిగా ఆకలి కాక, అన్ని రకాలా ఆహార పదార్ధాలూ తీసుకోలే క పోవడం వలన పోషకాహార లేమి వస్తుంది. ఇది వారికి మాత్రమే కాదు.. పుట్టిన, పుట్టబోయే పిల్లలకి ప్రభావం చూపుతుందని అందువలన మంచిది కాదని చెబుతున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అదే పిల్లలు తింటే.. పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు పిల్లలు ఈ అలవాటుకి బానిసలు కాకుండా చూసుకోవాలి. వారికి భయం పెట్టాలి.
తినడం వల్ల వచ్చే నష్టాలేంటి?
చాక్‌పీస్‌లు, బలపాల పెద్ద విష పదార్ధం కాదు. కానీ దాన్ని తినటం మంచిది కాదు. దాని వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. అవి:
1. దంతాలు పాడవ్వడం
2. జీర్ణ సమస్యలు
3. మలబద్ధకం
4. లెడ్ పాయిజనింగ్
5. కడుపులో నులిపురుగు పెరగడం
6. ఆకలి లేకపోడం
7. నోటిపూత లు రావడం
8. ప్రేగుల్లో సమస్యలు
9. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు
ఈ మధ్య కొన్ని వెబ్ సైట్ లలో తినదగిన బలపాలు అంటూ కొందరు అమ్ముతున్నారు . ఇవి పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రకటనలని వైద్యులు చెబుతున్నారు. తినే బలపాలు అని ఏమీ లేవు అని మనం తెలుసుకోవాలి.
ఈ సమస్య ఉన్నవారు కాళీ గ ఉండకుండా బిజీ గ ఉంచాలి. వారి మనసు బాలపాలమీదికి పోకుండా ఎదో ఒక వ్యాపకం కల్పించాలి.
ఇలా తినకూడనివి తినడం ప్రమాదo.
చిరంజీవి వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్