ఆడవాళ్లు అందానికి ఇచ్చిన ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వరు అనడం లో ఆశ్చర్యం లేదు . అందం గా ఉండడం కోసం రక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగేస్త్రీ లను మరింత అందంగా చూపించే వాటిలో స్తనాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆడవాళ్ళ స్తనాల పరిమాణం సరైన ఆకృతిలో ఉంటే వాళ్ళ అందంమరింత పెరుగుతుంది.
అయితే కొంతమంది అమ్మాయిలకుస్తనాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు చాల ఉంటాయి .. వాటి గురించి తెలియక అమ్మయిలు మార్కెట్లో దొరికే వివిధ రకాల మందులు వాడేస్తూ ఉంటారు . ఇలాంటివి వాడడం వల్ల భవిష్యత్ లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. కాబట్టి ఆరోగ్యకరం గా సహజంగా స్తనాల పరిమాణం ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం…
స్త్రీ ల ల్లో స్తానము ల పరిమాణం పెరగాలంటే బొప్పాయి కాయ చాలా బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజు బొప్పాయి రసం తాగడం లేదా బొప్పాయి ముక్కలు తినడం వల్ల స్తనాల ను పెంచుకోవచ్చు.
అదే విధంగా ప్రోటీన్ ఫుడ్‌ని తీసుకోవడం వల్ల కూడా స్తనాల పరిమాణం పెంచుకోవచ్చు.సోయాబీన్స్ లో ప్రోటీన్ అధికం గా ఉంటుంది. కాబట్టి వాటిని 13 గంటలు నాన బెట్టి ఉడకబెట్టుకుని కూరల్లోవేసుకుని తిన్న లేదా నాన బెట్టిన సోయాబీన్స్ మిక్సీ లో వేసి కొంచెం నీరు పోసి 5 నిమిషాల పాటు మెత్త గా రుబ్బుకుని పాలు తీసి వాటిని కాచుకుని తాగిన మంచి ఫలితం ఉంటుంది.ఎట్టి పరిస్థితులలో సోయాబీన్స్ ఉండికించకుండా, లేదావేడి చేయకుండా తీసుకోకూడదు. వీటితో పాటు కొన్ని రకాల వ్యాయామాలు కూడాస్తనాల పరిమాణాన్ని సహజంగా పెంచుతాయి. ఆలివ్ ఆయిల్ , లేదా నువ్వుల నూనె తో స్తనాల చుట్టూ చేతులను పెట్టి నెమ్మదిగా సవ్య, అపసవ్య దిశల్లో మసాజ్ చేస్తూ ఉండడం వలన కూడా స్తనాలు పెరిగే అవకాశం ఉంది.