ప్రస్తుతం ప్రపంచంలో ఉరుకులు పరుగుల జీవితం లో అనేకమంది వారి శృంగార జీవితాన్ని సరిగా గడపలేక పోతున్నారు. ఉదయం అంతా కష్టపడి ఇంటికి వచ్చాక, ఆ పని ఒత్తిడిలో త్వరగా నిద్ర పోవడం లేదా మానసిక ఆందోళన చెందడంతో శృంగార జీవితానికి దూరం అవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక మరికొందరికీ శృంగారంలో అనుమానాల వల్ల వారు పూర్తిగా ఎంజాయ్ చేయలేక పోతున్నారని తెలియచేస్తున్నారు నిపుణులు. మరికొందరైతే వారి లోపాల వలన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. అలాగే మగవారిలో ముఖ్యంగా శృంగారం సంబంధించిన సమస్యల విషయానికొస్తే.. వీర్య కణాల అభివృద్ధి, వాటి నాణ్యత విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఇందుకు సంబంధించి ఆయుర్వేద నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. పచ్చకర్పూరం వాడటం వల్ల మగవారిలో ఈ సమస్యలు తగ్గుతాయని అంటున్నారు.ఇలాంటి సమస్యల కలిగి ఉన్న వారికి పచ్చ కర్పూరం ఒక వరం అని వారు తెలియజేస్తున్నారు. ఈ పచ్చకర్పూరంతో సహజసిద్ధమైన వయాగ్రాని తయారుచేసుకోవచ్చు. ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం..
పచ్చకర్పూరం-5 గ్రాములు, జాజికాయ-5 గ్రాములు, జాపత్రి- 5గ్రాములు, ఎండుద్రాక్ష- 5గ్రాములు. వీటన్నిటిని తీసుకుని బాగా నూరి చిన్నచిన్న గింజలుగా చేయాలి. అంటే బఠాణి గింజంత మాత్రలుగా చేయాలి. వీటిని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని ఒక గ్లాసు పాలు తాగడం వల్ల వీర్యవృద్ధి చెందడమే కాక లైంగిక సామర్ద్యం కూడా మెరుగవుతుంది.
ముఖ్యంగా శరీరంలో ఉండే ఉష్ణం కూడా తగ్గించడానికి ఇది సహాయపడుతుందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నా సరే వెంటనే ఈ ప్రక్రియను ఆరంభించి సుఖ పడండి.