ఎవరైనా మన ఇంటికి వచ్చిన, మనం ఇతరుల ఇంటికి వెళ్ళిన వెంటనే వారు కాఫీ కలిపి ఇస్తారు . ఇది ఒక గౌరవ పూర్వకమైన మర్యాదగా భావిస్తారు. అయితే ఓ మహిళ తన సహ ఉద్యోగి కాఫీ కలిపి ఇచ్చిన కారణంగా ఆమెకు ఏకంగా కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అదేంటి కాఫీ ఇస్తే శిక్ష వేస్తారా? అనే కదా మీ అనుమానం. సాధారణంగా కాఫీ కల్పిస్తే ఎటువంటి శిక్ష పడదు. కానీ ఆ మహిళ చేసిన పని తెలిస్తే… శిక్ష పడడం కరెక్టే అని అంటారు. ఇంతకీ ఆమె ఏమి చేసిందో తెలుసా…
ఇటలీలోని పీడ్మాంట్కు చెందిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో మరియాంగెలా సెరాటో (54) అనే మహిళ పని చేస్తోంది. అయితే తన ఆఫీసులో పని చేసినన్ని రోజులు తన సహ ఉద్యోగి కి ప్రతిరోజు కాఫీ ఎంతో ప్రేమగా కలిపి ఇచ్చేది. ఆమె ఒక్కోసారి వద్దన్నా కూడా ఎంతో బలవంత పెట్టి తన చేత కాఫీ తాగించేది. అయితే సహోద్యోగి మాత్రం తనపై ఎంతో ప్రేమ చూపిస్తుందని భావించేది. ఒకరోజు ఆ మహిళా కారులో ప్రయాణిస్తుండగా, ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టి, కళ్ళు, తల తిరుగుతూ వళ్ళంతా నొప్పులతో బాధపడుతూ కారు తీసుకెళ్లి ఒక చెట్టుకు గుద్దింది. అయితే డాక్టర్లు ఆమెను పరీక్షించి ఎటువంటి సమస్య లేదు కేవలం బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు.
ఇంట్లో బెడ్ రెస్ట్ లో ఉన్నంతకాలం ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. వీకెండ్లో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తలేదు. కేవలం ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఎందుకిలా అవుతుంది అన్న ఆలోచనలో పడింది. నెమ్మదిగా తన ఆలోచనలు సేరాటో మీద పడ్డాయి. నేను వద్దంటున్నా ఎందుకంత బలవంతం చేసే నా చేత కాఫీ తాగించేది అని అనుమానం మొదలైంది. తరువాత ఆఫీస్ కు వెళ్ళగా తను ఎప్పటిలాగే కాఫీ కలుపుకుని తీసుకువచ్చింది. అయితే ఈసారి మాత్రం తన కాఫీ తాగుతున్నట్టు నటించి ఆ కాఫీ ఒక బాటిల్ లోకి తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించింది. అయితే డాక్టర్లకే దిమ్మతిరిగే విషయం బయట పడింది.
ప్రతిరోజు తన ఉద్యోగిని ఇచ్చే కాఫీలో బెంజోడియాజిపైన్ అనే డ్రగ్ అధికమోతాదులో ఉన్నట్లు పరీక్షల్లో వెలువడగా ఆమె సెరాటో మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన ఎటువంటి నేరం చేయలేదని పోలీసులకు చెప్పింది. కానీ డాక్టర్లు తను ఇచ్చిన కాఫీ వల్లే బాధితురాలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్న అని చెప్పడంతో పోలీసులు ఆమె పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. కోర్టులో కేసు వాదన జరగడంతో తప్పు సెరాటోదే అని తేలడంతో కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
మహిళా తరఫు న్యాయవాది మాట్లాడుతూ వారు పనిచేసే ఇన్సూరెన్స్ కంపెనీలో కాస్ట్ కటింగ్ కోసం ఉద్యోగులను తీసేస్తారు అన్న విషయం తెలియడంతో ఆమె ప్రతి రోజు తనకు కాఫీ కలిపి ఇవ్వడం ద్వారా తను ఉద్యోగానికి రాకపోతే, తన జాబ్ కి ఎటువంటి ఢోకా ఉండదనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడిందని, బాధితురాలు తరఫున న్యాయవాది వివరించారు. చూశారు కదా!మీకు ఎవరైనా ఇలా ప్రేమగా కాఫీ కలిపి ఇస్తే ఒక్కసారి ఆలోచించి తీసుకోండి.