NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Goji Berry Health: గోజీ బెర్రీ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు…గోజీ అంటే ఏమిటి? గోజి బెర్రీ తినడం వలన హెల్త్ సమస్యలకు దీర్ఘకాలిక ఉపశమనం! గోజి బెర్రీ హెల్త్ బెనిఫిట్స్!

Goji Berry: Health Benefits of Goji Berries
Advertisements
Share

Goji Berry Health: ఆరోగ్యాన్ని తక్షణమే ఇచ్చే ప్రకృతి వరాలు పండ్లు. వ్యాయామాల కోసం ఖర్చు పెట్టడం మానేసి పళ్ళను తినడం అలవాటు చేసుకోండి. మనకు ఆయా సీజన్లో దొరికే పళ్ళు తినడం చాల మంచిది. కానీ మనకి ఎక్కువగా తెలియని ఎంతో మేలు చేసే పళ్ళు కొన్ని ఉన్నాయి. ఈ పళ్ల గురించి , వాటిని తింటే మన శరీరానికి అందే పోషక విలువల గురించి ఇప్పుడు తెలుసు కుందాము. అలాంటి పళ్లలో గోజి బెర్రీ ఒకటి. ఎండుద్రాక్షల్లా కనిపించే గోజీ బెర్రీల‌ను ఎర్ర వజ్రాలు అని కూడా పిలుస్తుంటారు. వీటిని ఓ సూప‌ర్ ఫుడ్‌గా చెప్పుతున్నారు. ఈ పళ్ళు అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉండ‌ట‌మే కాక ఎన్నోపోషకాలను మనకి అందిస్తున్నాయి. గోజీ బెర్రీలు నిద్ర‌లేమిని త‌రిమి కొట్ట‌డంలో గొప్పగా స‌హాయ‌ప‌డుతాయి.ప్ర‌తి రోజు కొన్ని గోజీ బెర్రీల‌ను తీసుకుంటే రాత్రుళ్లు హాయిగా నిద్ర‌పోవ‌చ్చు.

Advertisements

స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలను దూరం చేయడంలో గోజీ బెర్రీలు చక్కగా పని చేస్తాయి.రోజుకు ప‌ది చ‌ప్పున గోజీ బెర్రీల‌ను తీసుకుంటే. వాటిల్లో ఉండే ప‌లు పోష‌కాలు పురుషుల వీర్యకణాల సంఖ్య, నాణ్యతను రెట్టింపు చేస్తాయి.స్త్రీల‌లో గర్భాశయ స‌మ‌స్య‌ల‌ను నివారిస్తాయి. మ‌రియు లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. అందువల్ల చాల మంది వీటిని తరుచు తింటున్నారు.

Advertisements
Goji Berry Uses: Excellent Health Benefits of Goji Berries
Goji Berry Uses Excellent Health Benefits of Goji Berries

గోజీ బెర్రీల గురించి చాలా మందికి ఎక్కువగా తెలియదు. చాలామందికి వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇవి సూపర్ టేస్ట్ ఉంటాయి. ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వయస్సు పైబడినవారే కాదు.. యంగ్ ఏజ్‌లో ఉన్నవారిని సైతం ఇప్పుడు కంటి చూపు సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలా ఇబ్బందులు పడుతున్నవారు గోజి బెర్రీలను డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిది. ఎండు గోజి బెర్రీస్’ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ మాదిరి వీటి ధర కాస్త ఎక్కువే ఉంటుంది. కేజీ క్వాలిటీని బట్టి రూ.1500 వరకు ఉంటుంది. లైసియం చినెన్స్, లైసియం బార్బరమ్ అని పిలిచే రెండు రకాల పొదలకు ఈ పండ్లు కాస్తాయి. వీటిని ఎండబెట్టి డబ్బాల్లో స్టోర్ చేస్తారు. చైనీయులు దీన్ని చిరుతిండిగా ఉపయోగిస్తారు. సూప్‌లో వేసుకుని తింటారు. అరటిపండు మాదిరిగా వీటిని తిన్న వెంటనే ఎనర్జీ లభిస్తుంది. వీటి ద్వారా శరీరానికి జియాక్సంతిన్ లభిస్తుంది. టిబెట్(Tibet), చైనా(China)లలో ఈ పళ్ళు ఎక్కువగా పండుతాయి. అందుకే ఈ పళ్ళను హిమాలయన్ గోజి, టిబెటన్ గోజి అని కూడా పిలుస్తారు. రోజుకో పది ఎండు గోజి బెర్రీలను తింటే కంటి సమస్యలు మటుమాయం అవుతాయని చైనీయులు చెబుతారు. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో కూడా గోజి బెర్రీల వల్ల కలిగే లాభాల గురించి ఓ అధ్యయనం ప్రచురితమైంది.

ఎండిన గోజీ బెర్రీలను క్రమం తప్పకుండా తింటే సైట్ రావడం, కళ్లల్లో మచ్చలు రావడం, ఇతర దృష్టి లోపాలు రాకుండా అడ్డుకుంటుందట. గోజీబెర్రీలలో ఉండే లుటీన్, జియాక్సంతిన్లు హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసి యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి. ఇక క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల నుంచి కూడా గోజీ బెర్రీలు రక్షణ ఇస్తాయని అధ్యయనంలో పేర్కొన్నారు.

Goji Berry: Excellent Health Benefits of Goji Berries
Goji Berry Excellent Health Benefits of Goji Berries

గోజి..తె ల్లని మంచుకొండల్లో ఓ చిట్టిపొట్టి చెట్టు… చెట్టునిండుగా నీలిరంగు పూలు… ఎర్రని పండ్లూ…భూప్రపంచంమీద మరే పండులోనూ లేని యాంటీఆక్సిడెంట్లు అందులోనే ఉన్నాయి … ఫలితం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలో అనేకరకాల పండ్ల సరసన గోజి పండ్లూ జ్యూసులూ పొడులూ కనిపిస్తున్నాయి. యాంటీఆక్సిడెంట్లు… అన్ని పండ్లలోనూ ఉంటాయి. కానీ యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉన్న ‘గోజి’ తింటే రోగనిరోధకశక్తి చాలాబాగా పెరుగుతుందన్న నమ్మకం పెరిగిపోయింది. దాంతో ఒకప్పుడు ఆసియాదేశాల్లో అదీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన గోజి, ఇప్పుడు అమెరికా, యూరప్‌మార్కెట్లలో రాజ్యమేలుతోంది. వెబ్‌సైట్లద్వారా ఈ మొక్కల అమ్మకం కూడా జరుగుతోంది. కేవలం 6 నుంచి 8 అడుగుల ఎత్తు వరకూ పెరిగే దీన్ని పెద్ద కుండీల్లో పెంచుకోవచ్చు. తాజా పండుగానూ డ్రైఫ్రూట్‌గానూ తినే గోజిని కొన్ని కంపెనీలు జ్యూస్‌రూపంలోనూ మార్కెట్‌ చేస్తున్నాయి. పెళ్లిచెట్టు అనీ యూత్‌ఫుల్‌ ట్రీ అని కూడా ఈ గోజి ని పిలుస్తారు. హిమాలయశ్రేణుల్లోనూ పశ్చిమ చైనాలోనూ ఇంకా టిబెట్‌, మంగోలియాలోనూ ఎక్కువగా పెరుగుతుంది. ఎలా వచ్చిందో తెలియదుకానీ ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న పేరు వోల్ఫ్‌బెర్రీ. దీన్ని భారతీ యులు మురళి అనీ జపనీయులు కుకొ నొ మి అనీ పిలుస్తారు. అయితే ఇటీవల అంతా గోజిగా పిలవడం ప్రారంభించారు. ఎన్నో మంచి ఫలితాలనిచ్చే గోజి, ఉష్ణమండలప్రదేశాల్లో కూడా చక్కగా పెరుగుతుందట. ఇందులో సుమారు 41 జాతులున్నాయి.

బ్లాక్‌బెర్రీస్ తింటున్నారా? బ్లాక్‌బెర్రీస్ తినకపోవడం వల్ల మీరు ఎంత నష్టపోతున్నారో తెలుసా? బ్లాక్‌బెర్రీ లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు!!

వీటిల్లో టిబెటన్‌ గోజి, హిమాలయన్‌ గోజి పేరుతో పండించేవి మాత్రం ఆరోగ్య కరమైన ఆహారం గా మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. మే నుంచి అక్టోబర్‌ వరకూ ఈ పండ్లకు సీజన్‌. సూపర్‌ఫ్రూట్‌! దీనిమీద విస్తృతంగా పరిశోధనలు చేసిన చైనా పరిశోధకులు ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లతోపాటు అమైనోఆమ్లాలు, ఖనిజ లవణాలు చాలా ఎక్కువని తేల్చారు. * కంటినిండా నిద్రపడుతుందనీ ఆకలిని పుట్టిస్తుందనీ కొత్తగా చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని తినడంవల్ల వృద్ధాప్యం దరిచేరదనీ సుదీర్ఘకాలం జీవిస్తారనీ శక్తినిస్తాయనీ చైనా సంప్రదాయవైద్యం పేర్కొంటోంది. * ఆరోగ్యవంతుల్లో ఇది బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ శాతం పెరగకుండా చేస్తుందట. * సెరటోనిన్‌ శాతాన్ని పెంచి ఆనందంగా ఉంచేందుకు దోహదపడుతుంది. అందుకే దీన్ని ‘హ్యాపీ బెర్రీ’ అనీ అంటారు. * కాలేయ పనితీరునీ మెరుగుపరుస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా క్యాన్సర్‌ కణాలను పెరగనివ్వదన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అందుకే 21వ శతాబ్దంలో అమెరికాతోపాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది సూపర్‌ఫ్రూట్‌గా మన్ననలు అందుకుంటూ బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను సొంతం చేసుకుంది. అందానికీ గోజి వయసును కనిపించనివ్వదన్న కారణంతో కాస్మొటిక్స్‌లో దీని వాడకం విపరీతంగా పెరిగింది. పైగా ఇది పొడి చర్మానికి మంచి సంరక్షణకారి. అందుకే మాయిశ్చరైజర్లు, క్రీములు, సబ్బులు మార్కెట్లో బాగా వస్తున్నాయి. గోజిబెర్రీ, దానిమ్మరసంతో చేసిన లిప్‌బామ్‌లు లండన్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. కొన్ని కంపెనీలు షేవింగ్‌ క్రీముల్నీ తయారుచేస్తున్నాయి.

Goji Berry: Health Benefits of Goji Berries
Goji Berry Health Benefits of Goji Berries

ఎక్కువగా మార్కెట్లో కనిపించే గోజి పండ్లు ప శ్చిమచైనా నింగ్సియా ప్రాంతం నుంచే వస్తున్నాయి. దాదాపు 600 సంవత్సరాలనుంచి అక్కడ వాణిజ్యపంటగా వెలుగొందుతొన్న వోల్ఫ్‌బెర్రీని అక్కడివాళ్లు ‘రెడ్‌ డైమండ్స్‌’గా పిలుస్తారు. ఇంకా మంగోలియా, క్వింగ్‌హాయ్‌, గన్సు, షాంక్సి ప్రాంతాల్లోనూ ఇవి ఎక్కువగా పండిస్తారు. అయితే వీటిలో ఎక్కువపండ్లను… పండగానే జాగ్రత్తగా కోసి వైన్‌లో ఓసారి వేసి తీసి డ్రైఫ్రూట్స్‌గా నిల్వచేస్తారు. ఎందుకంటే తాజాగా దొరకని ప్రాంతాల్లో ఎండుపండ్ల రూపంలోనే వీటి వాడకం ఎక్కువ. చైనీయులు ఔషధాలతోపాటు రకరకాల వంటకాల్లోనూ వీటిని వాడుతుంటారు. హెర్బల్‌ టీ కూడా చేస్తుంటారు. ద్రాక్షతోపాటు వీటిని కూడా కొన్ని రకాల వైన్స్‌లో వాడతారు. ఇటీవల ఇన్‌స్టంట్‌ కాఫీ పౌడర్‌ని కూడా చైనా తయారుచేస్తోంది.

కేవలం పండ్లు మాత్రమే కాదు… గోజి ఆకులు, లేతకొమ్మల్ని చైనీయులు ఆకుకూరగా వాడుతుంటారు. పోషకాలెన్నో..! వందగ్రాముల ఎండు వోల్ఫ్‌బెర్రీల నుంచి 370 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. ఇందులో 68% కార్బోహైడ్రేట్లు, 12% ప్రొటీన్లు, 10% పీచుపదార్థాలు లభ్యమవుతాయి. 112 మి.గ్రా. కాల్షియం, 1132మి.గ్రా. పొటాషియం, 9 మి.గ్రా. ఐరన్‌, 2 మి.గ్రా. జింక్‌, 1.3మి.గ్రా. విటమిన్‌ బి2, 7మి.గ్రా. బీటాకెరోటిన్‌ దొరుకుతాయి. అయితే విటమిన్‌-సి మాత్రం 26 నుంచి 100 గ్రా. వరకూ లభిస్తుంది. ఇది ఆరెంజెస్‌లోకన్నా చాలా ఎక్కువ. వెుత్తమ్మీద 11 రకాల ముఖ్యమైన ఖనిజలవణాలు, 18 అమైనో ఆమ్లాలు, 6 విటమిన్లు, 5 పాలీశాకరైడ్లు, 6 వోనోశాకరైడ్లు, 5 అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు, 5 కెరోటినాయిడ్లు, ఇంకా అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇంటర్నెట్‌ పుణ్యమా అని గోజిపండ్లకు ఆదరణ పెరిగింది. అందుకనే ఆరోగ్యాభిలాషులు అందరు గో జీ గెట్ గోజీ అంటున్నారు. కొంచం వాడి బావుంటే మళ్ళీ కొనచ్చు. ఇవీ గోజీ విశేషాలు.

 


Share
Advertisements

Related posts

Remdesivir : కేంద్రం కీలక నిర్ణయం..! కరోనా వ్యాధి గ్రస్తులకు గుడ్ న్యూస్..!!

somaraju sharma

బిగ్ బాస్ 4 : డబుల్ ఎలిమినేషన్ గుట్టు ఇదే..! కంటెస్టెంట్స్ ని పిచ్చోళ్ళను చేయనున్న నాగార్జున

arun kanna