Weight Loss: బరువు పెరగడం సులువే కానీ.. బరువు తగ్గడం కష్టమని చాలామంది అనుకుంటారు.. వాస్తవానికి బరువు తగ్గడం చాలా ఈజీ.. కానీ బరువు పెరగడం కష్టం.. కంటినిండా నిద్రపోతే బరువు తగ్గుతారా అంటే.. నిజమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు బరువు కి నిద్ర కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..!?
శరీర బరువును తగ్గించేందుకు నిద్ర ఎంతో మేలు చేస్తుంది ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి ఒకవేళ మీరు సరిగ్గా నిద్రపోకపోతే మాత్రం బరువు తగ్గడం కష్టమే అందువలన ప్రశాంతంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోండి కంటినిండా నిద్ర పోతే త్వరగా బరువు తగ్గుతారు నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి మెటబాలిజం నెమ్మదిస్తుంది.
శరీర మెటబాలిజం తగ్గితే వెయిట్ లాస్ అవ్వడం అంత తేలిక కాదు. మెటబాలిజం తగ్గడం అంటే క్యాలరీస్ బర్న్ చేసే ప్రాసెస్ నెమ్మదిస్తుంది. దాంతో మెటబాలిజం తగ్గి రక్తపోటు, థైరాయిడ్ అటాక్ చేసి ఇంకా బరువు పెరుగుతారు. కనీసం రోజుకి 7 నుంచి 8 గంటలు హాయిగా నిద్రపోండి. ఎంత ప్రశాంతంగా నిద్ర పోతే అంత త్వరగా బరువు తగ్గడానికి మీ శరీరం సహకరిస్తుంది.