అలోవెరా అతిముఖ్యమైన 75 విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి డయాబెటిస్ (మధుమేహం) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స గా పనిచేస్తాయి. కలబంద మీ చర్మ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంచడంలో అద్భుతంగా తోడ్పడుతుంది. జీర్ణ ప్రక్రియ వ్యవస్థను శుద్ధి చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుంది.
కేలరీలను, ఫ్యాట్నూ తగ్గిస్తుంది. ఓ గ్లాసులో అలోవెరా జ్యూస్ తీసుకొని, అందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ నిమ్మ రసం కలపాలి. ఎక్సర్సైజ్ చెయ్యడానికి వెళ్లేముందుగానీ, లేదా వర్కవుట్ పూర్తైన తర్వాత గానీ… ఈ జ్యూస్ తాగాలి. రోజూ ఇలా చేస్తే, మీ ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్లు మీకు అనిపిస్తుంది. ఈ జ్యూస్ మీ మెటబాలిజంను సరిచేయడం వల్ల మీ అధిక బరువు చాలా వేగంగా తగ్గుతుంది.మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్‌ని ఓ గ్లాస్ తీసుకోవాలి. అందులో ఓ టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్నుకలిపి తాగేస్తే, శరీరంలో చెడు వ్యర్థాలన్నీ పరారవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతాం.రెండు చెంచాల ఆలోవెరా జెల్‌ని ఒక చెంచాడు తేనెతో కలిపి ఒక కప్పులో వేయండి. బాగా కలిపి ఒక మిశ్రమంగా తయారు చేయండి.ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం అల్పాహారానికి అరగంట ముందు తీసుకోండి.తేనెలో ఉన్న అనామ్లజనకాలు మరియు ఆలోవెరాలో ఉన్న విటమిన్-ఇ జీవక్రియ క్రమాన్ని పెంచి సహజంగా మరియు సమర్థవంతంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.ఆలోవెరా జెల్ ను నీటిలో కలపండి. జ్యూస్ ను ప్రిపేర్ చేసుకోండి. దీన్ని గ్లాస్ లోకి తీసుకోండి. తాగేయండి. దీంతో త్వరగా బరువు తగ్గుతారు..