NewsOrbit
హెల్త్

ఎముకలు దృఢంగా ఉండాలంటే మీ ఆహారంలో ఇవి తప్పనిసరి….

మన శరీరంలో ప్రధానమైన వ్యవస్థలలో అస్థిపంజర వ్యవస్థ ఒకటి. అస్థిపంజర వ్యవస్థ మన శరీరానికి ఆకృతిని, రక్షణ కల్పిస్తుంది. మన శరీరం సుమారు 206 ఎముకలతో నిర్మితమై అన్ని జీవక్రియలు సక్రమంగా జరిగేటట్లు చూస్తుంది. అలాంటి ఎముకల ఆరోగ్యంగా, దృఢంగా ఉంటేనే మన శరీరంలో అన్ని విధులు సక్రమంగా నిర్వహించబడతాయి. సాధారణంగా ఎముకలు మధ్య వయస్సు వరకు అంటే, 30 సంవత్సరాల వరకు పెరుగుదల ఉంటుంది. తర్వాత ఎముకలు స్థిరంగా ఉండి వయసు పెరిగే కొద్దీ ఎముకలో క్యాల్షియం, పాస్పరస్ నిలువలు తగ్గడంతో ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది. ఎముకలు బలహీనపడితే కీళ్ల నొప్పులు , నడుము నొప్పి, వెన్ను నొప్పులు ,ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

ప్రస్తుత కాలంలో మానవుని జీవన శైలిలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పులు , నడుము నొప్పులు, మొదలగు ఎముక అరుగుదల సమస్యలతో బాధ పడుతున్నారు , దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, సమయానికి నిద్ర, ఆహారం తీసుకోలేకపోవడం . జింక్ ఫుడ్స్ తీసుకోవడం ,కాఫీ టీలు ఎక్కువగా తాగడం ఇలా చాలా కారణాలు ఉంటాయి. దీన్ని అధిగమించడానికి చిన్న వయసు నుంచే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎముకల పటుత్వాన్ని పెంచుకుని శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చ. ఎముకలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది తద్వారా సంతోషకర జీవితాన్ని పొందవచ్చు.

ఎముకలు దృఢంగా ఉండాలంటే మన నిత్య ఆహారంలో క్యాల్షియం తప్పనిసరిగా , రోజుకు కనీసం 1 గ్రాము కాల్షియం అవసరం అవుతుంది. పాలలో అధిక మొత్తంలో క్యాల్షియం ఉంటుంది రోజుకు ఒక గ్లాసు పాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో మన శరీరానికి అవసరమైన క్యాల్షియం లభిస్తుంది.
చిరు ధాన్యం అయిన రాగులు లో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది,దీనిని రాగి మాల్ట్ లేదా రాగి జావ రాగి ముద్ద రాగి రొట్టె మన ఆహారంలో తప్పని సరి చేసుకోవాలి .తద్వారా ఎముకలకు కావలసిన క్యాల్షియం వృద్ధి చెందుతుంది. ప్రతిరోజు నారింజ, అంజీర పండు( డ్రైఫ్రూట్) అయినా సరే, బత్తాయి, సపోటా పండ్లను ఆహారంలో తీసుకోవడం వల్ల క్యాల్షియం సమృద్ధిగా లభించడంతో పాటు మన శరీరానికి అవసరమైన C విటమిన్ ఉంటుంది.C విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రోజుకు కొన్ని బాదం పప్పులను నానబెట్టుకుని ఉదయం తీసుకుంటే శరీరానికి అవసరమైన క్యాల్షియం లభిస్తుంది. బెల్లంతో తయారు చేసే వేరుశనగ చిక్కి, నువ్వుల చిక్కి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది .

ఎముకలు దృఢం గా ఉండాలంటే క్యాల్షియం తో పాటు విటమిన్ D కూడా చాలా అవసరం. విటమిన్ D లభించే పదార్థాలైన కోడిగుడ్డు, చేపలు, చికెన్ , బెల్లంతో తయారు చేసిన వంటకాలు, లివర్ మొదలైన ఆహారంలో D సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి ఆహారంలో ఈ విభాగం కావాలి. ఆహారంతో పాటు ఉదయం, సాయంత్రం వ్యాయామం నడవడం వంటివి చేస్తే మరీ మంచిది ఇలా చేయడం వల్ల సూర్యరశ్మిలో సహజ సిద్ధంగా లభించే విటమిన్D కూడా లభిస్తుంది. తద్వారా వృద్ధాప్యంలో కూడా క్యాల్షియం సమృద్ధిగా లభించి ఎముకలు దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి.

మరీ తీవ్రమైన వెన్నునొప్పి నడుము నొప్పి తో బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri