మన అందరికి వేప చెట్టు గురించి తెలిసే ఉంటుంది. పట్టణాల్లో అంటే కనిపించడం అరుదు గాని పల్లెటూర్లలో అయితే ఇంటికో చెట్టును పెంచుతారు. వేప చెట్టు వలన చాలా రకాల అనారోగ్య సమస్యలు నయం అవుతాయి. ఎందుకంటే వేప చెట్టులోని ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. వేప చెట్టు నుండి వీచే గాలి కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.అలాగే వేప చెట్టుకు సర్వ రోగనివారిణి అనే పేరు కూడా ఉంది. మరి ఈ వేప చెట్టును ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేప వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు :
వేప చెట్టు ఆకులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగస్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో అనేక రకాల రోగాలను నయం చేయడంలో ఎక్కువగా వేప ఆకులను ఉపయోగిస్తారు. ఉదయం పరగడుపున రెండు వేప ఆకులను తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల తగ్గుతాయి. ఇలా వేప చెట్టు ఆకులతో కషాయాన్ని చేసుకొని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా వేప ఆకుల పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పోతాయి.దీనిని రెండు పూటలా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
వేప ఆకులను ఎలా ఉపయోగించాలంటే..?
గ్యాస్,అజీర్తి, కడుపులో మంట, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి కూడా వేప ఆకులు బాగా సహాయపడతాయి. కొన్ని వేప ఆకులను తీసుకుని మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న చోట ఉంచి ఒక గుడ్డతో కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి.కళ్ల కలక, కంట్లో దురదలు, కళ్ల మంట వంటి సమస్యలతో బాధపడే వారు వేపాకుల కషాయంతో కళ్లను కడుక్కోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి.స్నానం చేసే నీటిలోవేప ఆకులను వేసి వేడి చేసి ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే వేప ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల చుండ్రు, తలలో దురదలు వంటి సమస్యలు తగ్గుతాయి.