NewsOrbit
హెల్త్

ఏమిటి ఈ రెడ్ రైస్ – బరువుకోసం ఇది తినమంటున్నారు మంచిదేనా ?

ఏమిటి ఈ రెడ్ రైస్ - బరువుకోసం ఇది తినమంటున్నారు మంచిదేనా ?

మీరు ప్రతిరోజూ తీసుకునే ఆహారమనేది మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి, మీరు ఆహారంపై శ్రద్ధ  పెట్టడం అవసరం. రెడ్ రైస్ ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాల వలన ఈ రైస్ ప్రస్తుతం అందరికీ మోస్ట్ వాంటెడ్ రైస్ గా మారింది. మీరు కూడా ఒక్కసారిప్రయత్నించి చుడండి.

ఏమిటి ఈ రెడ్ రైస్ - బరువుకోసం ఇది తినమంటున్నారు మంచిదేనా ?
పాలిష్ చేయబడిన రైస్ వెరైటీస్ కంటే ఈ రెడ్ రైస్ లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ.రెడ్ రైస్ ను కూడా మీరు మితంగానే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే అరుగుదల సమస్య వస్తుంది.
రెడ్ రైస్ ను వండుకోవడం సులభమే. వైట్ రైస్ ను ఎలా వండుతామో అలాగే దీన్ని కూడాఅలాగే వండుకోవాలి. ఈ రెడ్ రైస్ ను కూరలతో, సాంబార్ తో మీరురోజువారీగా తినే వెరైటీస్ తోకలిపి తినవచ్చు. కొన్నిసార్లు పోహా అలాగే పులావ్ వంటి వంటలలో లోకూడా రెడ్ రైస్ ను వాడతారు.

బరువు తగ్గేందుకు డైట్ లో ఎటువంటి మార్పులు చేసుకోవాలో తెలీక తికమకపడేవారు రెడ్ రైస్ ను తినడం మొదలు పెట్టండి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ సున్నా. కాబట్టి, దీన్ని తినడం వలన బరువు పెరుగుతారేమోనన్న భయం అవసరం లేదు.

రెడ్ రైస్ తో ఇమ్యూనిటీ పెరుగుతుంది.దాంతో, అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. రెడ్ రైస్ లో ఉండే సెలీనియం అనేది వివిధ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.రెడ్ రైస్ ను మీరు ఆహారం లో భాగంగా చేసుకుంటే ఇక బోన్ హెల్త్ గురించి దిగులు పడనవసరం లేదు. ఇందులో ఉన్న మెగ్నీషియం వలన ఇది సాధ్యమవుతుంది.జాయింట్ ప్రాబ్లెమ్స్ ను తగ్గించేందుకు కూడా రెడ్ రైస్ ఉపయోగపడుతుంది. రెడ్ రైస్ లో ఐరన్ కంటెంట్ ఉండడం వలన, రోజూ ఈ రైస్ ను తింటే ఆక్సీజన్ ను శరీరం గ్రహిస్తుంది. మీరు మరింత ఎనర్జిటిక్ గా ఫీలవుతారు. అలసట దరిచేరదు.

రెడ్ రైస్ లో విటమిన్ అలాగే ఐరన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ రెండూ శరీరంలోని రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ను పెంచుతాయి. దాంతో, చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. రైస్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫ్రీ రాడికల్స్ పై పోరాటం జరుపుతాయి. కాబట్టి, ప్రీమెచ్యూర్ ఏజింగ్ సమస్య బారిన పడే ప్రమాదం తక్కువేనని చెప్పుకోవచ్చు.ఈ రైస్ లో మెగ్నీషియం లభిస్తుంది. ఇది బ్రీతింగ్ ప్యాటర్న్ ను అదుపు చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి, ఆస్త్మా అటాక్స్ ను తగ్గిస్తుంది. రెడ్ రైస్ ఇన్సులిన్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డయాబెటిక్స్ కు ఈ రైస్ ఎంతగానో ప్రయోజనకరం.రెడ్ రైస్ లోపీచు పదార్ధం ఎక్కువగా లభిస్తుంది. ఇది జీర్ణప్రక్రియకు సహాయం చేస్తుంది. బవుల్ మూవ్మెంట్ ను సులభతరం చేస్తుంది. అలాగే, ఇందులో ఉండే పీచు పదార్థం మాటిమాటికీ కలిగే చిరు ఆకలి సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి, జంక్ ఫుడ్ పై మనసు వెళ్ళదు.అయితే ఈ విషయంలో మీ డాక్టర్ సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri