Califlower: గోబీ తింటున్నారా..!? అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

Share

Califlower:  గోబీ.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. దీనిని కూరగా తినేవారు కంటే మంచురియాగా తిన్నవారే ఎక్కువ మంది..!! అయితే చాలా మంది దీనిని తినటానికి ఇష్టపడరు.. ఎక్కువ మందికి దీని వాసన పడదు.. అయితే దీనిని మనం తీసుకుంటే ఇందులో ఉండే పోషక విలువలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. క్యాలీఫ్లవర్ ను మన డైట్ లో భాగం చేసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!!

Regularly Eat Califlower: to check some Health problems
Regularly Eat Califlower: to check some Health problems

Califlower:  గోబీ తో క్యాన్సర్ కు చెక్ పెట్టండిలా..!!

కాలీఫ్లవర్ లో విటమిన్ బి, సి కాంప్లెక్స్ పుష్కలంగా ఉన్నాయి. దీనిలో పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇందులో కెలోరీలు తక్కువగా ఉంటాయి.. దీనిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరనివ్వదు. చర్మంపై ముడతలు లేకుండా చేస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ పై సానుకూల ప్రభావం చూపుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. టాక్సిన్స్ శరీరాన్ని శుభ్ర పరుస్తాయి. కాలీఫ్లవర్ తినడం వలన చెడు కొలెస్ట్రాల్ నిల్వ ఉండకుండా చేస్తుంది. గర్భిణీ స్త్రీలు క్యాలీఫ్లవర్ తింటే పిండం సక్రమంగా ఎదుగుతుంది. క్యాబేజ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే శక్తి ఉంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. దీనిలో ఉండే పొటాషియం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. రెగ్యులర్ గా క్యాలీఫ్లవర్ ను తినటం వలన క్యాన్సర్ ను అరికట్టవచ్చు. దీనిలో ఉండే గ్లూకోసేనోలేట్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇంకా కంటి సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. కంటిశుక్లం తో బాధపడేవారు దీనిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా కాలీఫ్లవర్ ని ఎక్కువగా తీసుకోవడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

Regularly Eat Califlower: to check some Health problems
Regularly Eat Califlower: to check some Health problems

Califlower:  కాలీఫ్లవర్ యే కాదు.. దాని ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి..!!

కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి క్యాలీఫ్లవర్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలని భావించేవారు ఇందులో ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  ఉడకబెట్టిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్ ని వ్యాయామం చేసే ముందు లేదంటే చేసిన తరువాత తీసుకుంటే వ్యాయామం కారణంగా వచ్చే కండరాల నొప్పి తగ్గుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడటానికి కాలిఫ్లవర్ చక్కటి పరిష్కారం సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. వారానికి రెండు సార్లు తీసుకుంటే మూత్ర సంబంధిత సమస్యలు రావు. శరీరం లోని మలినాలను మూత్రం ద్వారా బయటకు పోతాయి. దీనిని తినడం వలన శరీరంలో వేడి తగ్గుతుంది . అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దీనిని తింటే జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. క్యాలీఫ్లవర్ ఆకుల రసాన్ని పుండ్లు గాయాలు ఉన్నచోట రాస్తే గాయాలు త్వరగా మానిపోతాయి.


Share

Related posts

ఎన్నడూ లేనిది అన్నం తింటున్నప్పుడు మీకు ఇలా అనిపిస్తే – ఖచ్చితంగా కరోనా నే !

sekhar

విజయ్ మాల్యాకు సుప్రీం షాక్

Siva Prasad

బిగ్ బాస్ 4 : “నువ్వెవ్వడు నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి?” అభిజిత్ కి కోపం వస్తే మామూలుగా లేదు

arun kanna