NewsOrbit
హెల్త్

వాళ్ళు ఈ డైట్ మాత్రమే తినాలి .. ఎవరు వాళ్ళు ?

వాళ్ళు ఈ డైట్ మాత్రమే తినాలి .. ఎవరు వాళ్ళు ?

క్యాన్సర్  ట్రీట్‌మెంట్ తర్వాత ముఖ్యమైనది ఆహారం తీసుకోవడం. తినేవి, తినకూడనివి, తినగలిగేవి, తినగలలేనివి, తిని తీరాల్సినవి… రకరకాల రూల్స్ ఉంటాయి. అవి దృష్టిలో పెట్టుకుని పోషకాల విషయంలో రాజీ పడకుండా టైమ్‌కి ఆహారం ఇస్తూ ఉండాలి. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యకరమైన మరియు పోషకాహారం చాలా ముఖ్యం. ఎందుకంటే  వారి రికవరీలో  ఆహారం భారీ పాత్రను పోషిస్తాయి. చికిత్స సమయంలో సరైన ఆహారం తినడం వలన బలముగా ఉండటానికి సహాయపడుతుంది. సమతులాహారంలో తాజా కూరగాయలు మరియు పండ్లు ఉండాలి.

వాళ్ళు ఈ డైట్ మాత్రమే తినాలి .. ఎవరు వాళ్ళు ?
తాజా ఆకు కూరలలో ఫోలైట్ మరియు విటమిన్ B ఉంటాయి. అవి క్యాన్సర్ దాని చికిత్స వలన కలిగే హానికరమైన ప్రభావాలపై సమర్ధవంతముగా పోరాటం చేస్తాయి. అంతేకాకుండా కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది. అందువలన ఎముకలు బలోపేతం అవ్వడానికి  మరియు సెల్ మరమ్మత్తుకు సహాయం చేస్తాయి.
గుడ్లు విటమిన్ B, D, E మరియు ప్రోటీన్లను కలిగి ఉంటుంది. గుడ్లు లో ఉన్న సెలీనియం కీమో థెరపీ దుష్ప్రభావాలు తగ్గించేందుకు బాగా ఉపయోగ పడుతుంది . వికారం,వెంట్రుకలు రాలిపోవడం, కడుపు నొప్పి మరియు బలహీనతలను తగ్గిస్తుంది.
అల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న మూలిక. అల్లం తినడంవలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కీమో చికిత్స ముందు అల్లం తినటం వలన రోగులకు వికారం భావన తక్కువ ఉంటుంది.
నేరేడులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణములు సమృద్ధిగా ఉన్నాయి. ఈ చిన్న పండ్లు క్యాన్సర్ కాకుండా,అనేక ఇతర వ్యాధులను ఎదుర్కోవడానికి ఉపయోగిస్తారు. ఒక నేరేడు ఒక ఆపిల్ కంటే 11 రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ ను కలిగి ఉంది.
పిప్పరమెంటు క్యాన్సర్ చికిత్స తరువాత ప్రభావాలను తగ్గించేందుకు ఒక మంచి మూలికగా ఉంది.ఇది పొడి నోరు మరియు వికారం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక ఆందోళనను తగ్గిస్తుంది. అలాగే వికారం నియంత్రణ, నిర్జలీకరణం నిరోధించడానికి సహాయం చేస్తుంది.
బీన్స్,పప్పులు, చిక్కుళ్ళు మరియు బటానీలు వంటి తాజా కూరగాయలలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. అవి నయం మరియు సెల్ మరమ్మత్తుకి సహాయపడతాయి. అంతేకాక రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఎర్ర రక్త కణాలు పెంచడానికి మరియు కోలుకోవడానికి కూడా సహాయపడతాయి.
మజ్జిగలో ఉత్తమ ప్రోబైయటిక్ ఉంటుంది. దీనిలో 100 కంటే ఎక్కువ ఉపయోగకరమైన ఎంజైములు ఉంటాయి. ఈ ఎంజైములు అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి మరియు రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. మజ్జిగలో జలుబు మరియు దగ్గు వ్యతిరేకంగా పనిచేసే అనేక ప్రతిరోధకాలు ఉన్నాయి. దీనిలో క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. కాన్సర్ అనగానే ఒకప్పటిలా ఇప్పుడు భయపడే పరిస్తితులు లేవు. సరైన సమయం లో దాన్ని గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అందులోనించి బయట పడి మామూలు జీవితం గడపగలిగే అవకాశమే ఎక్కువ. దీనికల్లా అవగాహన ముఖ్యం. మనం ఏం తింటున్నాం, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎంత ప్రశాంతంగా గడుపుతున్నాం… అన్న విషయాల్లో అవగాహన ఉండి జీవనశైలి లో కావాల్సిన మార్పులు చేసుకోవడం అవసరం. అప్పుడు కాన్సర్ ఒక్కటే కాదు, చాలా రకాల వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri