ఆలుమగాల జీవితంలో శృంగారానికి చాల ప్రాముఖ్యత ఉంది. దాంపత్య జీవితంలో తొలి ప్రాధాన్యత శృంగరానికే ఉంటుంది. అయితే ఈ రోజుల్లో శృంగారం అవధులు లేని చర్యగా మారుతుంది అని చెప్పక తప్పదు. మీరు చాల సార్లు వినే ఉంటారు.. శృంగారం గురించి మాట్లాడాలంటే చాలా మంది నాన్ వెజ్ తో పోల్చి చెప్తుంటారు.
నాన్ వెజ్ జోక్స్ అని శృంగారపరమైన ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఇది సరదాకి చేసే చమత్కారమే అయినా.. నిజంగానే శృంగారానికీ.. తినే ఆహారానికి మధ్య సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు.శాఖాహారం, మాంసాహారం ఈ రెండింటికి శృంగారంతో సంబంధం ఉందని చెబుతున్నారు. శృంగారం విషయంలో శాకాహారం తీసుకునే మహిళలు, మాంసాహారం తీసుకునే మహిళలను పోల్చి చూస్తే శృంగారంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే మాంసాహారం తీసుకునే వారిలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని కానీ మాంసాహారం సెక్స్ సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుందని, భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనల్లో తేలింది.కాబట్టి శృంగార సామర్థ్యం పెంచుకోవాలంటే పుష్టికరమైన ఆహారంతోపాటు మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండేలా చూసుకోవాలని పరిశోధకులు తెలియచేస్తున్నారు.ఇక ఏ వేళలో అయితే శృంగారానికి అనువుగా ఉంటుందనే అంశం పై కూడా పరిశోధన చేశారు. తెల్లవారుజామున చేసేశృంగారం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని కొన్ని అధ్యయనల ద్వారా వెల్లడైంది.రాత్రిపూట నిద్ర పోవడం వలన పగటి అలసట అంతా పోయి విశ్రాంతి పొందిన శరీరానికి శక్తి వస్తుంది.సహజంగానే తెల్లవారే సరికి శృంగార వాంఛ పెరుగుతుందని ఇది చాలామందికి అనుభవంలో ఉన్నవిషయమే అని పరిశోధకుల మాట.నిద్రతో లభించిన విశ్రాంతి తో శృంగార సంబంధమైన హార్లోన్ల విడుదల పెరుగుతుందిట. తద్వారా శృంగార కాంక్ష పెరుగుతుంది. అలాంటి సమయంలో కలయిక జరిగితే ఆనందం పొందే స్థాయి పెరుగుతుంది.అని నిపుణులు చేసిన పలు సర్వేలలో తెల్సింది.