మారుతున్న కాలంతో పాటు మనుషుల జీవశైలిలో కూడా చాలా రకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో తెల్లజుట్టు వచ్చేది. కానీ. ఇప్పుడు వయసుతో పని లేకుండా చిన్న వయసులోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది.కారణాలు ఏమైనా కానివ్వండి కానీ ఈ తెల్లజుట్టు సమస్యతో చాలా మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి మన జుట్టులో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం ఉండాలిసిన దాని కంటే తక్కువగా ఉంటే జుట్టు తెల్లబడటం జరుగుతుంది.కొందరు తెల్లజుట్టు కనిపించకుండా ఉండడం కోసం మార్కెట్లో దొరికే కలర్స్, డైస్ వాడుతూ ఉంటారు. కానీ వాటి వలన తాత్కాలిక ఫలితం ఉంటుంది కానీ శాశ్వత ఫలితం ఉండదు.మరి తెల్ల జుట్టుని సహజంగా నల్లగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా.దానికి మేము చెప్పే ఈ టిప్స్ పాటిస్తే సరి.
తెల్ల జుట్టు నల్లగా మారడానికి చిట్కాలు :
ముందుగా కొన్ని మందార పువ్వులు, కొన్ని నువ్వులు,రెండు ఉసిరి కాయలు, కొద్దిగా కొబ్బరి నూనెను మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి.ఈ పేస్ట్‌ను క్రమం తప్పకుండా రాసుకుంటూ ఉంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
ఉల్లిపాయ రసం :
అలాగే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత గురించి మీరు వినే ఉంటారు.ఉల్లిపాయ జుట్టుకు చాలా ఉపయోగకరంగా పని చేస్తుంది.ముందుగా కొన్ని ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి ఆ తరువాత ఉల్లిపాయ రసాన్ని కాటన్ క్లాత్ ద్వారా ఫిల్టర్ చేసి రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఇలా వచ్చిన ఉల్లిపాయ రసాన్ని తలపై మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలి.జుట్టుకు సరైన పోషకాహారం అందకపోయినా సరే జుట్టు ఉడిపోవడం, తెల్లబడడం జరుగుతుంది.