NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Vijayamma: విజయమ్మ వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షపదవిలో ఉన్నట్టా..? లేనట్టా…? వైఎస్ఆర్ టీపీలో చేరిపోయారా..? తెలుగు ప్రజల్లో కన్ఫ్యూజన్..!!

Vijayamma: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల సోదరుడు ఏపి సీఎం వైఎస్ జగన్ అభీష్టానికి భిన్నంగా తెలంగాణలో రాజకీయ పార్టీ ఆవిర్భావం చేసిన సంగతి తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు రెండు రాష్ట్రాల్లో వేరువేరు పార్టీలకు చీఫ్ లు ఉండటం భారతదేశ చరిత్రలో ఇదే ప్రధమం కావచ్చు. జగన్ ఏపిలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడుగా, సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, తన సోదరి వైఎస్ షర్మిల పొరుగు రాష్ట్రం తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలిగా పార్టీని ప్రకటించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన నాటి నుండి జగన్ ఆమెకు దూరంగా ఉన్నట్లు తెలుస్తూనే ఉంది.

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీకి ఆయన తల్లి విజయమ్మ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ హోదాతోనే కుమార్తె షర్మిల పార్టీ పేరు విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్ఒసి) ఇసీకి ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. షర్మిల రాజకీయ పార్టీ సన్నాహాలు ప్రారంభించినప్పటి నుండి విజయమ్మ ఆమె వెంటే నడుస్తున్నారు. ఖమ్మంలో జరిగిన సభలో, హైదరాబాదులో నిరుద్యోగ సమస్యపై షర్మిల నిర్వహించిన నిరాహార దీక్ష కార్యక్రమంలో షర్మిలతో కలిసి విజయమ్మ పాల్గొన్నారు. వైఎస్ఆర్ టీపీ ఆవిర్భావ సభలోనూ పాల్గొని ప్రసంగించారు. నిన్న పులివెందులలో జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లోనూ విజయమ్మ కుమార్తె షర్మిలతోనే పాల్గొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్ష పదవిలో ఉన్నట్టా? లేనట్టా? కుమార్తె పార్టీ అయిన వైఎస్ఆర్ టీపీలో చేరిపోయారా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల నుండి వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు వైఎస్ఆర్ సీపీ అధికార పత్రిక సాక్షిలోనూ విజయమ్మ పేరు ముందు గతంలో రాసిన విధంగా నేడు వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు అని సంభోదించకపోవడం కూడా ఈ కన్ఫ్యూజన్ కు కారణం అవుతోంది. కుమార్తె షర్మిల పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్న కారణంగా విజయమ్మ స్వయంగా వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ సీపీ నా, లేక వైఎస్ఆర్ టీపీనా అనే విషయంపై పార్టీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!