NewsOrbit
హెల్త్

తగినంత నీరు తాగుతున్నారా?

తగినన్ని మంచినీళ్లు ఎందుకు తాగాలి? తాగకపోతే ఏమవుతుంది? నీరు ప్రాణాధారమని అందరికీ తెలుసు. అయితే శరీరానికి తగినంత నీరు ఇస్తున్నామా అన్నది ప్రశ్న. ఇస్తే ఏం జరుగుతుందో తెలిస్తే ఇవ్వకపోతే ఏమవుతుందో తెలిసిపోయినట్లేగా!

మలబద్ధకం రాదు:

నీళ్లు తాగకపోతే మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. మలబద్ధకం మనిషిని చికాకు పెడుతుంది. తగినంత నీరు తీసుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు. ఇతరత్రా కారణాలతో కూడా మలబద్ధకం రావచ్చనుకోండి. నీళ్లు తక్కువ తాగుతున్న కారణాన్ని ముందు రూల్ అవుటే చేయండి.

కీళ్లు బాగుంటాయి:

కీళ్ల దగ్గర ఎముకల మధ్య మృదులాస్తి అనే కణజాలం ఉంటుంది. అది ఎముకల మధ్య ఒరిపిడి లేకుండా కాపాడుతుంది. ఈ మృదులాస్థి ఎక్కువ భాగం నీరే. తగినంత నీరు తీసుకుంటే ఆరోగ్యకరమైన మృదులాస్థితో కీళ్లు బాగా పని చేస్తాయి.

చెమట పడుతుంది:

మనిషికి చెమట పట్టడం మంచిది. దానితో పాటు మలినాలు బయటకు వెళ్లడమే కాకుండా శరీరం ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. వ్యాయామం చేసేప్పుడు మరిన్ని నీళ్లు తాగడం మరచిపోవద్దు.

డీహైడ్రేషన్ తప్పిచుకోవచ్చు:

నీరు తక్కువ తీసుకున్నపుడు చెమట ఎక్కువ పడితే శరీరానికి అవసరమైన పొటాసియం, సోడియం వంటి ఖనిజలవణాలు ఎక్కువ బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్ వస్తుంది. అది ప్రమాదకరం.

మూత్రపిండాల ఆరోగ్యం:

తగినంత నీరు తాగితే మూత్రపిండాలు బాగా పనిచేసి మలినాలను విసర్జిస్తాయి. తగినంత నీరు తీసుకోకపోతే రక్తంలో మలినాలు పెరిగిపోతాయి. మూత్రపిండాలు మయోగ్లోబిన్ అనే ప్రొటీన్లతో ఇబ్బంది పడతాయి. ఫలితంగా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

మెదడు ఆరోగ్యం:

తగినంత నీరు శరీరానికి ఇవ్వకపోతే మెదడు పనితీరు దెబ్బతింటుంది. చాలాసేపు నీరు తాగకపోతే ఆలోచన మందగిస్తుంది, గమనించండి.

బరువు తగ్గొచ్చు:

తక్కువ నీరు తాగేవారితో పోల్చుకుంటే ఎక్కువ నీరు తాగేవారికి అధిక బరువు సమస్యలు సాధారణంగా ఉండవు. నీరు ఎక్కువ తాగితే జీవప్రక్రియలు  సజావుగా సాగుతాయి. పొట్టలో నీరు ఎక్కువగా ఉంటే తిండి తినడం కూడా తగ్గుతుంది. అది మంచిదేగా!

గుండెపై భారం తగ్గుతుంది:

తగినంత నీరు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో నీరు తగ్గినపుడు రక్తం కూడా తగ్గుతుంది. పైగా రక్తనాళాల పనితీరు మందగిస్తుంది. ఫలితంగా రక్తపోటు పడిపోయి గుండె వేగం పెరుగుతుంది.

తగినంత అంటే ఎంత?

దీనికి సమాధానం విషయంలో ఏకాభిప్రాయం లేదు. కానీ ఆరోగ్యవంతులైన మనుషులు రోజుకు కనీసం రెండు నుంచి రెండున్నర లీటర్ల వరకూ మంచినీళ్లు తాగితే చాలన్న మాటతో ఎక్కువ మంది ఏకీభవిస్తారు.

ఎక్కువ తాగితేనో?

అవసరానికి మించి ఎక్కువగా నీరు తీసుకున్నా సమస్యే సుమా! దానివల్ల శరీరంలో లవణాలు పలచబడిపోయి హైపోనేట్రిమియా అనే ఆరోగ్య  సమస్య  తతెత్తుతుంది.

Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri

Leave a Comment