Corona: కరోనా క‌ల‌క‌లం.. డబ్ల్యూహెచ్‌వో తాజా వార్నింగ్ ఇదే…

Share

Corona: కరోనా క‌ల‌క‌ల‌కంలో థర్డ్‌ వేవ్ భ‌యాందోళ‌న‌లు ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థ‌ర్డ్ వేవ్ ప్రారంభమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా డబ్ల్యూహెచ్‌వో మరో వార్నింగ్‌ ఇచ్చింది. మళ్లీ కరోనా కల్లోలం సృష్టించబోతోంది అని హెచ్చరించింది. గ‌త వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 ల‌క్షల మంది కొత్తగా కరోనా మహమ్మారి బారినపడ్డారని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్టర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌న‌మ్ గెబ్రియేస‌స్.. మ‌రో రెండు వారాల్లోగా ఆ సంఖ్య 20 కోట్లకు చేరుతోందని తెలిపారు..

Read More: Corona: క‌రోనా డెల్టా వేరియంట్ ఎంత డేంజ‌ర్ అంటే…


ఆందోళ‌న‌క‌రంగా…
అనేక దేశాల్లో డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్‌ వేరియంట్ కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్న విషయం విదితమే. దీనిపై తాజాగా డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్టర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌న‌మ్ గెబ్రియేస‌స్ మాట్లాడుతూ రెండో వారాల్లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 20 కోట్ల మందికి కరోనా సోకుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం వెలుగుచూస్తున్న పాజిటివ్‌ కేసుల తీరును పరిశీలిస్తూ ఈ అంచనా వేశారు. ఈ లెక్క‌ల‌న్నీ త‌మ అంచ‌నాల ప్రకార‌మే త‌క్కువేన‌ని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో చీఫ్ మరింత ఎక్కువగానే ఉండొచ్చని మీడియాకు వెల్లడించారు.

Read More : Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎంత డేంజ‌ర‌స్ అనేది మీరు ఇలా తెలుసుకోవ‌చ్చు!

ఇప్ప‌టికే మ‌న ప్ర‌భుత్వం
ఇదిలాఉండ‌గా కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్ప‌టికే థ‌ర్డ్ వేవ్ గురించి హెచ్చ‌రించింది. నీతిఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకేపాల్‌ మాట్లాడుతూ, ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్‌వేవ్‌ దిశగా కదులుతున్నామనడానికి ఇది సంకేతమన్నారు. కొవిడ్‌-19 నిబంధనలను కచ్చితంగా పాటిస్తేనే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే గ్లోబల్‌ హెచ్చరికను జారీ చేసిందని, దాని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యరంగంలో మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఆయ‌న తెలిపారు. కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. అనేక దేశాలలో కోవిడ్ కేసులు మరోసారి పెరిగాయన్నారు. పొరుగు దేశాలైన మయన్మార్, ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్‌లలో కూడా కేసులలో పెరుగుదల కనిపిస్తుందని చెప్పారు. ముఖ్యంగా మయన్మార్‌, బంగ్లాదేశ్‌లో సెకండ్‌వేవ్‌తో పోలిస్తే థర్డ్‌వేవ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నదన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక, మాస్కుల వాడకం దాదాపు 74 శాతం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర‌జ‌లు క‌రోనా మార్గద‌ర్శ‌కాలు పాటించాల‌న్నారు.


Share

Related posts

Mahesh Babu: ఆరు నెలలోనే మహేష్ సరికొత్త ప్లాన్.. అభిమానులకు ఇక పండగే…??

sekhar

Trivikram : త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్‌..?

GRK

ఆ విషయంలో అవగాహనా కల్పించడానికి ఆడవారే కోచ్ లు గా పనిచేస్తున్నారట!!

Kumar