NewsOrbit
జాతీయం

26/11 Mumbai Attacks: ముంబై26/11 దాడులు జరిగి నేటికీ 14ఏళ్లు..!!

26/11 Mumbai Attacks: సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఇదే రోజు ముంబైలోని తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రదాడికి యావద్దేశంతో పాటు ప్రపంచం ఉలిక్కిపడటం జరిగింది. లష్కరే తోయిబాకి చెందిన పదిమంది ఉగ్రవాదులు.. జరిపిన దాడుల్లో.. పలువురు అమెరికన్ లతో సహా మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబై26/11 భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఉగ్రదాడిగా మిగిలిపోయింది. ఈ దాడిలో పాల్గొన్న పదిమంది ఉగ్రవాదులలో 9 మందిని అక్కడికక్కడే భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ప్రాణాలతో పట్టుపడ్డ కసాబ్ నీ అనంతరం ఉరి తీయడం జరిగింది.

Today marks 14 years since Mumbai taj terror attacks
Mumbai Terror Attacks

 

ముంబై26/11 సూత్రధారి పాక్ లోనే…

కానీ ఈ దాడికి సూత్రధారి హాఫిజ్ సయ్యద్ మాత్రం.. పాక్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అయితే ఈ దాడి జరిగి నేటికి 14 సంవత్సరాలు కావస్తున్నా గాని.. దాడిలో గాయపడ్డ బాధిత కుటుంబాలకు ఇప్పటికీ కూడా సరైన న్యాయం జరగలేదు. ఈ ఘోరానికి పాల్పడిన వారు మాత్రం శత్రుదేశంలో స్వేచ్ఛగా తిరుగుతూ.. ఉన్న క్రమంలో వారిని చట్టం ముందుకు తీసుకొస్తేనే భాదిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎన్ జయశంకర్ ట్విట్టర్ లో తెలియజేశారు. ముంబై26/11 ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తికి పాక్ శిక్ష వేయకపోవడం పై ఇప్పటికీ కూడా భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. సముద్ర మార్గం గుండా బోటు ద్వారా ముంబైకి చేరుకున్న ఈ ముష్కరాలు.. టాక్సీలలో ఇంకా రెస్టారెంట్ లలో మరియు రైల్వే స్టేషన్ లో చేసిన మరణ హోమానికి.. చాలామంది అమాయకులు బలైపోయారు. తాజ్ హోటల్ లో తొమ్మిది మంది ఉగ్రవాదులు.. విచక్షణ రహితంగా జరిపిన కాల్పులకి.. దేశం మొత్తం భయాందోళనకు గురైంది.

Today marks 14 years since Mumbai taj terror attacks
Mumbai Terror Attacks

 

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. హైలెట్ ఆపరేషన్..

ఈ క్రమంలో ఉగ్రవాదులను నిర్మూలించడానికి బ్లాక్ కమాండోస్ రంగంలోకి దిగి.. ఆపరేషన్ నిర్వహించి దాదాపు 60 గంటలు కష్టపడి ఉగ్రవాదులను మట్టు బెట్టారు. ఈ ఆపరేషన్ లో NSG కమాండోలు.. చేసిన ఆపరేషన్ అతిపెద్ద హైలెట్. వీళ్ళని ముందుకు నడిపించడంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కీలక పాత్ర పోషించాడు. ఒక్కడే ఉగ్ర మూకలపై దాడి చేస్తూ… మిగతా కమాండోస్ కి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వాళ్లకి ఆదేశాలు ఇచ్చి ఉగ్రముకలపై కాల్పులు జరిపి వీర మరణం పొందాడు.దాదాపు 60 గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ లో కసబ్ మినహా మిగతా ఉగ్రవాదులను భారత సైన్యం మట్టు బెట్టింది. ఏకే 47 తుపాకులతో ముంబై వీధులలో.. రెస్టారెంట్లలో.. వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు జరిపి బాంబులు మోత మోగించారు. కొన్ని టాక్సీలలో బాంబులు కూడా పెట్టడం జరిగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మరణ హోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. భారతీయులు కాకుండా ఇతర దేశాలకు చెందిన 14 మంది పౌరులు కూడా మరణించడం జరిగింది.

Today marks 14 years since Mumbai taj terror attacks
Mumbai Terror Attacks
రాష్ట్రపతి నివాళి

ఈ క్రమంలో ఇప్పటికీ కూడా భారత ప్రభుత్వం ముంబై26/11 దాడుల సూత్రధారిని.. పాకిస్తాన్ ప్రభుత్వం చట్టం ముందుకు తీసుకువచ్చి శిక్షించాలని కోరుతూ ఉంది. ఇదిలా ఉంటే దాడులు జరిగే ముంబై26/11 దాడులు జరిగి 14 సంవత్సరాల అవుతున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నివాళులు అర్పించారు. “ఏ ఉగ్రవాదుల దాడులలో ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఇది నిర్వహణలో భాగంగా ధైర్యంగా పోరాడి ఎంతోమంది భద్రతా సిబ్బంది కూడా తమ ప్రాణాలు త్యాగాలు చేశారు. వారి త్యాగాలను దేశం స్మరించుకుంటుంది. మృతులకు నివాళులు అర్పిస్తుంది.. అనే ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

 

Related posts

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju