Krishna Mukunda Murari: శివన్న మీదకు మురారి కోపంగా వెళ్తాడు. తను మాట్లాడే మాటలకు కోపం వచ్చి శివన్న తలకి గురిపెడతాడు మురారి.ఇంకోసారి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని చూస్తే నీకు మర్యాదగా ఉండదు అని చెప్తారు. అంతలో శివన్న మురారి మీదకి కోపంగా వస్తాడు. ఇంకోసారి ఈ అమ్మాయి జోలికి వస్తే ఊరుకోను అంటూ.. మురారి తన జీప్ లో కృష్ణ ను ఎక్కించుకుని తనని తీసుకువెళ్తాడు.

చంద్రశేఖర్ వాళ్ళ ఇంటికి మురారి వస్తాడు. గురువుగారు అని పలకరిస్తాడు. రండి సార్ అని మురారిని లోపలికి తీసుకు వెళ్తాడు చంద్రశేఖర్. మురారి మీద ఉన్న కోపంతో కృష్ణ చికెన్ కూరలో కావాలని కారం ఎక్కువగా వేస్తుంది. ఈ కారంతో అతనికి బాగా టార్చర్ పెట్టాలి. మొన్న మా నాన్నకు వీఆర్ఎస్ ఇవ్వమంటే ఇవ్వలేదు కదా నా కోపం అంటే ఏంటో ఎలా ఉంటుందో చూపిస్తాను అని కృష్ణ అంటుంది. ఇక కృష్ణ వాళ్ళిద్దరికీ వడ్డిస్తుండగా.. మురారి కావాలని మీరు కూడా కూర్చోండి కృష్ణ. ముగ్గురం కలిసి భోజనం చేద్దామని మురారి అంటాడు. ఇక వాళ్ళ నాన్న కూడా అదే మాట చెప్పడంతో సరే అని కృష్ణ కూర్చుంటుంది. గురువుగారు నేను ఇవాళ చికెన్ తినను అని మురారి అంటాడు. మొత్తానికి కృష్ణ చేత చికెన్ తినిపిస్తాడు. నాన్న మీరు తినండి అంటూ కృష్ణ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి కారం కారం అని నోరు తుడుచుకుంటూ ఉంటుంది . అప్పుడే మురారి తన దగ్గరకు వచ్చి ఫోన్ లో ఈరోజు చికెన్ బిర్యాని ఆర్డర్ చెయ్యి అని అంటాడు చెరపకురా చెడేవు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

మురారి ఆదర్శ కి ఫోన్ చేసి ఇప్పటికైనా నీ భార్య ఎలా ఉంటుందో నాకు చూపించరా అని మురారి అంటాడు. ఇప్పుడే చూపిస్తున్నాను నువ్వు చూసి నీకు నచ్చలేదు అని చెబితే ఈ పెళ్లి ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే ఆపేస్తాను అని ఆదర్శ్ అంటాడు . తన ఫ్రెండుతో మాట్లాడమని ముకుందా కి ఆదర్శ్ ఫోన్ ఇస్తాడు. ముకుంద కి ఫోన్ ఇచ్చినట్టే ఇచ్చి ఆదర్శ్ ఫోన్ లాక్కుంటాడు. అదేంట్రా చూడనివ్వలేదు అని మురారి అడగగానే.. నేను నీకు ఆల్రెడీ చెప్పాను. నువ్వు వచ్చి అమ్మాయిని చూసి నచ్చింది అని చెబితేనే తన మడలో తాళి కడతాను. లేదంటే తన మెడలో తాళికట్టను ఇది ఫిక్స్ నువ్వు అర్జెంటుగా రా అని ఆదర్శ్ అంటాడు. సరేరా అయితే వస్తాను అని మురారి అంటాడు.

మురారి చంద్రశేఖర్ తో గురువుగారు నేను ఊరు వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు రండి అని అంటాడు చంద్రశేఖర్. అది కాదు సార్ ఒక రోజు ముందు వస్తాం అని అంటారు. మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. నాతో పాటే ఊరు రావడం మంచిది. మీరు కూడా రండి అని మురారి అనగానే సరే అంటాడు. ఇక అదే విషయాన్ని చంద్రశేఖర్ కృష్ణతో చెబుతాడు. కానీ కృష్ణ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్లడానికి వీల్లేదు అని అంటుంది మనం పెళ్ళికి వెళ్తే టిఆర్ఎస్ ఇస్తానని మురారి అని చెప్పాడు అని అనగానే సెంటిమెంట్ మీద కొట్టావు నాన్న వస్తాను అని కృష్ణ అంటుంది.
ఇక దారిలో వెళ్తూ వెళ్తూ ఓ హోటల్ దగ్గర ఆగుతారు ఈసారి కృష్ణ కావాలని కాఫీలో ఉప్పు కలిపి ఇస్తుంది. అది తాగిన మురారి ఉప్పు కలిపావా అని అడుగుతాడు. అవును అని కృష్ణ చెబుతుంది. మా నాన్నకి మీరు విఆర్ఎస్ ఇస్తానన్నారు కాబట్టి ఇప్పుడు మీతో పాటు ఊరు వస్తున్నాను అని చెబుతుంది. నేను విఆర్ఎస్ ఇవ్వను అది గవర్నమెంట్ చూసుకుంటుంది అని మురారి కృష్ణతో చెబుతాడు. ఇక మురారి ఆదర్శం ముకుందా వాళ్ళ పెళ్ళికి వెళ్తాడు. ఏర్పాట్లు అన్ని బాగా జరుగుతాయి. ఇక అప్పుడైనా మురారి ముకుందను చూస్తాడా చూడడా అనేది చూడాలి..