SBI: మనలో అనేక మందికి క్రెడిట్ కార్డులు ఉంటాయి. మార్కెట్లో చాలా మంది బ్యాంకు వాలంటీయర్లు క్రెడిట్ కార్డు తీసుకోమని ప్రోత్సహిస్తూ వుంటారు. తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. తరువాతే మొదలవుతుంది గానా భజానా. అంటే దానికి తగ్గట్టు మన సంపాదన కూడా ఉండాలి కదా. లేదంటే రిస్కులో పడిపోతాం. మన చుట్టూ ఎన్నో బ్యాంకులు. అందులో SBI ఒకటి. మిగిలిన వాటితో పోలిస్తే రూల్స్ విషయంలో SBI అస్సలు తగ్గనే తగ్గదు. అయితే ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు మీదగ్గర ఉండి దీన్ని కూడా క్లోజ్ చేయాలని చూస్తున్నారా? అయితే ఈ విషయాలను ముందు చూడండి.
Viveka Murder Case: వివేకా కేసులో మరో ట్విస్ట్ ..పులివెందుల కోర్టును ఆశ్రయించిన పీఏ కృష్ణారెడ్డి..
SBI క్రెడిట్ కార్డును ఎలా క్లోజ్ చేసుకోవాలో ఇపుడు తెలుసుకుందాం..
ఈ క్రెడిట్ కార్డు వుండే వారు email పంపడం ద్వారా, కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా లేదంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి రిక్వెస్ట్ ఫామ్ ఇచ్చి క్రెడిట్ కార్డును క్లోజ్ చేసుకోవచ్చు. ఇక SBI వ్యక్తిగత వెబ్సైట్ ప్రకారం.. హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి, మెయిల్ పంపడం ద్వారా క్రెడిట్ కార్డును క్లోజ్ చేసుకోవచ్చు. అకౌంట్ క్లోజర్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మీరు మీ క్రెడిట్ కార్డును కట్ చేయాల్సి ఉంటుంది. అంటే సదరు కార్డు యొక్క ఆనవాలు మన దగ్గర ఎంతమాత్రమూ ఉండకూడదు.
అయితే క్రెడిట్ కార్డు క్లోజ్ చేసే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.!
క్రెడిట్ కార్డు క్లోజ్ చేసే వారు ఈ విషయం మర్చిపోకూడదు. క్రెడిట్ కార్డు క్లోజ్ అయిన తరువాత దీనిపై వచ్చిన యాడ్ ఆన్ కార్డు కూడా పని చేయడం జరగదు. అది కూడా క్లోజ్ అయ్యి తీరుతుంది. కార్డు క్లోజ్ చేయడానికి ముందు మీ క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం కట్టివేయాలి. అలాగే నెగటివ్ రివార్డు పాయింట్లు ఉంటే.. అవి ఆటోమేటిక్‌గా స్టేట్మెంట్లో వచ్చి చేరుతాయి. తరువాత ఆ డబ్బులు కూడా కట్టాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డుపై ఒక్క రూపాయి కూడా బాకీ ఉండకూడదు. అప్పుడే మీ క్రెడిట్ కార్డు క్లోజ్ అవుతుంది. లేదంటే ఎంతమాత్రమూ అవ్వదు.
దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…