పసి పిల్లల చర్మం చాలా సున్నితంగా , కోమలంగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణం లో ఎక్కువ వేడి ఉన్న ఎక్కువ చలి ఉన్న పిల్లలు తట్టుకోలేరు. వాళ్ల చర్మం ఆ వాతావరణానికి వెంటనే అలవాటు పడలేదు. అందువల్ల చిన్నారుల చర్మాన్ని కాపాడడానికి, రక్షణ కల్పించడానికి బేబీ ఆయిల్ బాగా పనిచేస్తుంది.
ధర కాస్త ఎక్కువైనప్పటికీ… చాలా మంది బేబీ ఆయిల్‌తో పిల్లలకు మసాజ్ చేస్తున్నారంటే, కారణం దాని వల్ల కలిగే మంచి ప్రయోజనాలే. బేబీ ఆయిల్ కేవలం పిల్లలకు మాత్రమే ఉపయోగించాలి అనుకుంటే పొరపాటే. ఆ నూనె ని పెద్దవాళ్లు కూడా ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.చర్మం పగిలి నప్పుడు చాలామంది వేజిలైన్ రాస్తుంటారు. అలాంటి సమయంలో వేజిలైన్ లేకపోతే,ఈ ఆయిల్ ని రాసుకుకుంటేబాగా పనిచేస్తుంది.
మేకప్ తొలగించాలన్న కూడా బేబీ ఆయిల్‌ని ఉపయోగించి శుభ్రం చేసుకోవచ్చు.
ముఖానికి తేమ అందాలంటే ఈ నూనెని ఎక్కువ సార్లు వాడడం మంచిది. పొడిచర్మం వారికి దురద, దద్దుర్ల సమస్యల్ని కూడా బేబీ ఆయిల్ తగ్గిస్తుంది .
కంటి కింద ఏర్పడిన వలయాలు, నల్లటి గీతల ను బేబీ ఆయిల్ సమర్ధ వంతంగా తొలగిస్తుంది. ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు కొంతమంది కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దద్దుర్ల వంటివి ఏర్పడినప్పుడు ఈ నూనె రాయడం వల్ల తగ్గించుకోవచ్చు.
ఒక్కోసారి కాలి పాదం చర్మం పెళుసు గా అనిపిస్తుంది. రాత్రి పడుకు నే సమయం లో ఈ నూనె రాసి మృదువుగా మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ విధం గా బేబీ ఆయిల్‌ని పెద్దవాళ్లుకూడా వాడుకోవచ్చు.