NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

భీమిలి బాద్‌షా ఎవ‌రో తేలిపోయిందా… అదొక్క‌టే స‌స్పెన్స్‌…!

ఉమ్మడి విశాఖ జిల్లాలోని కీక‌ల‌మైన‌ నియోజకవర్గం భీమిలి. ఇప్పటి వరకు ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగాయి. రానున్న 17వ ఎన్నికకు ఈ నియోజకవర్గం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఆరుసార్లు టీడీపీ, ఆరుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ ఇక్క‌డ 2019 ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకుంది. మాజీ ఎంపీ, టీడీపీ మాజీ నాయ‌కుడు అవంతి శ్రీనివాస‌రావు ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కారు.

ఈ సారి కూడా ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నా.. వైసీపీ నుంచిఎలాంటి గ్రీన్ సిగ్న‌ల్ అంద‌లేదు. పైగా ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో మార్పు త‌ప్ప‌ద‌నే ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఉన్న ప్ర‌త్యేక‌త ఏంటంటే.. వ‌రుస‌గా ఏ పార్టీకీ ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌డం లేదు. 2004 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కర్రి సీతారామ్‌ విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజయం సాధించారు.

ఇక‌, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించారు. వైసీపీ నుంచి బరిలోకి దిగిన కర్రి సీతారామ్‌పై 37,226 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇక్కడ గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీ చేసిన సబ్బం హరిపై 9712 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అంటే.. వ‌రుస‌గా ఏ పార్టీ కూడా ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకోలేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇదే సంప్ర‌దాయం కొన‌సాగితే.. భీమిలి అడ్డాలో వైసీపీ జెండా ఎగ‌ర‌డం ప్ర‌శ్నార్థ‌క‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఎవరు బరిలోకి దిగుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. సిటింగ్‌ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గడిచిన ఎన్నికల్లో గెలిచిన తరువాత మంత్రిగా క్యాబినెట్‌లో పని చేశారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నుంచి ప్రస్తుతం ఇన్‌చార్జ్‌గా రాజాబాబు ఉన్నారు. గంటా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N