బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఎన్నడూ లేని విధంగా నామినేషన్ ప్రక్రియ బాగా వేడెక్కింది. ఇంటిలో నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో అర్థం కావడం లేదు కాబట్టి నామినేషన్లు బాగా కీలకం కానున్నాయి. ఈ రోజు ఆటలో ఒక్కొక్కరి దగ్గర నుంచి సరికొత్త పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం.
ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేసే విధానాన్ని చాలా నొప్పించే విధంగా క్రియేట్ చేసిన బిగ్ బాస్ ఊహించిన మజా అయితే దొరకబోతోంది. మెడలో హార్ట్ సింబల్ వేసుకున్న వారిని నామినేట్ చేయాలి అంటే కత్తి తో హుచ్చాలి. ఇది చాలా కోపాన్ని తెప్పించేలా ఉంది అనే చెప్పాలి. ఇక సోహెల్ అయితే వీర లెవల్ లో తన కోపాన్ని చూపించేశాడు. అభిజిత్, హారికల పై కోపంతో రెచ్చిపోయాడు. అవినాష్ కూడా ఒక రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు.
ఇక ఎవరూ ఊహించని విధంగా మోనాల్ అవినాష్ గుండెల్లో గుచ్చి నామినేట్ చేసింది. మీ పనులు మీరు సక్రమంగా చేయకుండా నన్ను ఎలా అంటారని అవినాష్ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. అయితే అన్నింటికన్నా హైలైట్ సోహెల్, అభిజిత్ మధ్య జరిగిన చర్చ. అభి సోహెల్ ప్రవర్తన పై అసహనం వ్యక్తం చేశాడు.
నీకు ఇదివరకే కొన్ని సార్లు చెప్పాను మాటలు జాగ్రత్త అని అంటే… సోహెల్ ఏమాత్రం వినకుండా నేను…. మీ లాగా బ్రో బ్యాచ్ కాదు ఏదో స్టైల్ గా బ్రో అనుకుంటూ ఉండే రకం కాదని కౌంటర్ ఇచ్చాడు. రారా, పో రా, నీ అమ్మ ఇవే నడుస్తాయి మా దగ్గర… హేయ్ వాట్సాప్ బ్రో లాంటివి మా దగ్గర ఉండవు అని కౌంటర్ ఇచ్చాడు. అందుకు అభి తీవ్రమైన అసహనం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ మాత్రం హౌస్ ను పూర్తిగా హీటెక్కించింది అనే చెప్పాలి.