Paya non: హైదారాబాద్ లో దొరికే బిర్యానీ కాకుండా ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే మరి కొన్ని రుచులు ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆజీజా హోటల్ లో దొరికే పాయ నాన్ ఒక్కసారి అయినా తినవలిసిందే. ఒక్కసారి తింటే ఇంకా వదిలి పెట్టారు. ఈ హోటల్ ప్రత్యేకత ఏమిటంటే పాయ నాన్ ను బ్రేక్ ఫాస్ట్ లో లోనే మనకి సర్వ్ చేస్తారట. ఇక్కడ తెలుసుకోవాలిసిన ఇంకో విషయం ఏమిటంటే బ్రేక్ ఫాస్ట్ లో తప్ప ఇది దొరకదు. మటన్ కర్రీ తో కలిపి నాన్ తో వచ్చే ఈ ఫుడ్ ని రుచి చూశారంటే అద్భుతఃహ అనక మానరు… మీకు టైం ఉంటే దానికోసమే స్పెషల్ గా వెళ్లి రుచి చూసి రండి..
దోశ లో చీజ్, మసాలా, బటర్, టాపింగ్ చేసి సర్వ్ చేసే ఈ దోశ తింటే మీరు మల్లి ఆర్డర్ చెప్తారు. దాంతోపాటు బాగా దట్టించిన కారంపోడి, నెయ్యితో పాటు ఇచ్చే ఇడ్లీ తింటే ఇడ్లి మాకు ఇష్టం లేదు అని చెప్పేవారు కూడా రోజు తింటామంటారు. నాంపల్లిలో ఉండే రామ్ కి బండి, మరియు బేగంబజార్ లో ఉండే గోవిందా కి బండి లో ఈ ఫుడ్ దొరుకుతుంది. మంచి ఇరానీ చాయ్ ఒక్కసారి అయినా రుచి చూడాలి అనుకుంటే మాత్రం, హిమయత్ నగర్ లో నిలోఫర్ కేఫ్ దీనికి పెట్టింది పేరు అని మన హైదారాబాదీలు వెంటనే చెప్పేస్తారు.
ఒక మంచి ఇరానీ చాయ్ తో ఇక్కడ దొరికే సమోసా తింటే మీరు స్వర్గం చూసివచ్చినంత ఆనందం పొందుతారు. ఒక సారి మీరు అటువెళ్లి దాని సంగతి ఏమిటో తెలుసుకుని రండి.అబిడ్స్ లో ఉండే జాన్స్ బేకరీలో పూర్తి సాంప్రదాయ రుచులతో దొరికే బర్గర్ మాములు బర్గర్ కంటే కొన్ని రేట్లు రుచిగా ఉంటుంది. ఇక్కడ దొరికే ఈ బర్గర్స్ కి చాలా డిమాండ్ ఉంది. బంగాళా దుంప చిప్ప్ తో ఇచ్చే ఈ బర్గర్ ని తిని తీరవలిసిందే.మార్కెట్ లో దొరికే ఐస్ క్రీమ్ లు కాకుండా దేశీ ఐస్ క్రీమ్ లు ట్రై చేయాలనుకున్నా వాళ్లకి ముహాంజామ్ మార్కెట్ లో దొరికే ఐస్ క్రీమ్ లు చక్కని సమాధానం. రకరకాల పళ్ల తో చేసే ఈ ఐస్ క్రిమ్ లు ఒక్కసారి రుచి చూశారంటే,మళ్ళి ,మళ్ళి అక్కడికే వెళ్తారు