NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

బిగ్ బాస్ కి వస్తావా అంటే.. 16 కోట్లు అడిగాడు.. వామ్మో !!

bollywood star salman khan demands 16 cr for one week of bigg boss episodes

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన స్టార్ హీరో మాత్రమే కాదు.. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానితో పాటు పలు టీవీ షోలలోనూ పాల్గొంటుంటారు.

bollywood star salman khan demands 16 cr for one week of bigg boss episodes
bollywood star salman khan demands 16 cr for one week of bigg boss episodes

ఇక.. హిందీలో బిగ్ బాస్ షో పాపులర్ అవడంతో పాటు సక్సెస్ అయిందంటే దానికి కారణం సల్మాన్ ఖాన్. దాదాపు 10 సీజన్లకు హోస్ట్ సల్మాన్ ఖానే. 2010 నుంచి ఇప్పటి వరకు సల్మాన్ ఖానే దానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ప్రతి సంవత్సరం ఎటువంటి అడ్డంకులు లేకుండా బిగ్ బాస్ షో నడిచినప్పటికీ.. ఈ సీజన్ అంటే బిగ్ బాస్ 14 కి కరోనా అడ్డంకిగా మారింది. ఈసారి సీజన్ ఉంటుందో ఉండదో అని బిగ్ బాస్ అభిమానులు టెన్షన్ పడ్డారు. కానీ.. షూటింగ్ లు గట్రా చేసుకోవడానికి సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో వెంటనే బిగ్ బాస్ ను పట్టాలకెక్కించారు.

వచ్చే అక్టోబర్ నుంచి బిగ్ బాస్ సీజన్ 14 ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగానే హోస్ట్ కోసం సల్మాన్ ఖాన్ ను బిగ్ బాస్ బృందం సంప్రదించిందట. అయితే ఈసారి బిగ్ బాస్ షో కోసం సల్మాన్ ఖాన్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను అడిగారట. సీజన్ మొత్తానికి 16 కోట్ల పారితోషకాన్ని సల్మాన్ డిమాండ్ చేశారట. దీంతో బిగ్ బాస్ షో యాజమాన్యం వామ్మో.. అని నోరెళ్లబెట్టారట.

బిగ్ బాస్ సీజన్ 14 కంటెస్టెంట్ల కోసం ఇప్పటికే కొందరు సెలబ్రిటీలను సంప్రదించారట. అయితే కంటెస్టెంట్ల విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ పైనే సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

నిజానికి బిగ్ బాస్ సీజన్ 4 నుంచి 6 వరకు సల్మాన్ ఖాన్ తీసుకున్నది 2.5 కోట్ల పారితోషకమే. సీజన్ 7 నుంచి  5 కోట్ల రూపాయలు తీసుకున్నారట. ఇలా సీజన్ లతో పాటుగా తన పారితోషకాన్ని కూడా సల్మాన్ పెంచుతూ పోయారు. చివరకు సీజన్ 14 కు ఏకంగా 16 కోట్ల రెమ్యునరేషన్ ను సల్మాన్ డిమాండ్ చేశాడట. బిగ్ బాస్ 13వ సీజన్ కు సల్మాన్ 12 నుంచి 14 కోట్ల పారితోషకం పొందినట్లు తెలుస్తోంది.

అయితే.. గత సీజన్ కు వచ్చిన రెస్పాన్స్, క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈసారి 14 వ సీజన్ లో మరో 5 వారాలు పొడిగించనున్నట్లు సమాచారం. అందుకే.. సల్మాన్ కూడా ఎక్కువ పారితోషకం అడిగి ఉంటారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఏది ఏమైనా బిగ్ బాస్ 14 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతున్నది. దాని షూటింగ్ కూడా ముంబైకి సమీపంలోని పన్వేల్ లో ఉన్న సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లోనే జరగబోతోంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju