NewsOrbit
జాతీయం న్యూస్

విద్యార్ధినుల ప్రైవేటు వీడియోలు లీక్ … చండీగడ్ యూనివర్శిటీలో విద్యార్ధినుల ఆందోళన

పంజాబ్ లోని ఓ యూనివర్శిటీ లో జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. మోహాలీలో ఉన్న చండీగడ్ యూనివర్శిటీ విద్యార్ధినుల ఆందోళనతో అట్టుడికిపోయింది. తమ ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వర్శిటీ హాస్టల్ విద్యార్ధినులు శనివారం రాత్రి నుండి ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. హాస్టల్ లో ఉంటున్న ఓ విద్యార్ధిని .. ఇతర విద్యార్ధినులు బాత్ రూమ్ లో స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసి తన స్నేహితుడికి పంపగా, అతను ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తమ ప్రైవేటు వీడియోలు లీక్ కావడంతో విద్యార్ధినులు ఆందోళనకు గురైయ్యారు.

Chandigarh University hostel Girls Protest

 

ఈ ఘటనతో మనస్థాపానికి గురైన ఎనిమిది మంది విద్యార్ధినులు ఆత్మహత్యయత్నంకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే విద్యార్ధినులు ఎవరూ ఆత్మహత్యాయత్నంకు పాల్పడలేదని పోలీసులు, యూనివర్శిటీ అధికారులు పేర్కొంటున్నారు. వీడియోల వ్యవహారం బయటకు రాగానే ఓ యువతి అస్వస్థతకు గురైందని, ప్రస్తుతం ఆ విద్యార్ధిని ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె క్షేమంగానే ఉందని పోలీసులు తెలిపారు.

Chandigarh University hostel Girls Protest

 

ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీఎస్పీ రూపిందర్ కౌర్ తెలిపారు. ఓ నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, సెల్ ఫోన్ ను సీజ్ చేసి ఫొరెన్సిక్ కు పంపినట్లు తెలిపారు. దోషులకు తప్పనిసరిగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని విద్యార్ధినులు ఆందోళన విరమించాలని కోరారు. ఎవరూ ఆత్మహత్యాయత్నంకు పాల్పడలేదని సీనియర్ సూపర్నిటెండెంట్ ఆఫ్ పోలీసు వివేక్ సోనీ తెలిపారు. వదంతులు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

Chandigarh University hostel Girls Protest

ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్దోత్ సింగ్ బైన్స్ స్పందించారు. వర్శిటీ విద్యార్ధినులు శాంతియుతంగా ఉండాలని కోరారు. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఇది చాలా సున్నితమైన విషయమని, మన అక్కా చెల్లెళ్లు, కూతుళ్ల గౌరవానికి సంబంధించినదని సంయమనం పాటించాలని సూచించారు. మీడియాతో పాటు ప్రజలందరూ ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ ఘటనపై పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టి సారించింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటి మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. కేసు దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. నిందితులకు కఠనంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని విద్యార్ధినుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N