Chiranjeevi – Surya: మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ సినిమా ఆచార్య. వాస్తవంగా ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగాల్సింది. కానీ ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో సోలో డేట్ చూసుకొని
2022, ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు అఫీషియల్‌గా రిలీజ్ డేట్ కూడా చిత్రబృందం అనౌన్స్ చేసింది. మెగాస్టార్ సరసన ఇందులో కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, చరణ్ సరసన మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది.
మిర్చి నుంచి భరత్ అనే నేను వరకు వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ వచ్చిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. ఇది మెగా మల్టీస్టారర్ కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు
తగ్గట్టుగానే దర్శకుడు కొరటాల శివ చిరు – చరణ్‌ల లుక్స్‌తో పాటు కాజల్, పూజా హెగ్డేల లుక్స్ కూడా హైప్ తెచ్చేలా మేకోవర్ చేశాడు. ఇక మణిశర్మ అందిస్తున్న సంగీతం చాలా స్పెషల్‌గా నిలిస్తోంది.
Chiranjeevi – Surya: ఆచార్య వస్తున్న రోజే సూర్య కూడా తన సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే రిలీజైన సాంగ్స్ భారీ క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. అయితే ఇప్పటివరకు ఆచార్య సినిమాకు మరో సినిమా ఏదీ పోటీ లేదనుకున్నారు. కానీ, తాజాగా దీనికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తన 40వ సినిమా ‘ఎత్తారెక్కుమ్ తునిందవన్’ను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య గత రెండు సినిమాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ ఓటీటీలో వచ్చి భారీ హిట్ సాధించాయి. ఈ క్రమంలో సూర్య క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇక నెక్స్ట్ సినిమాను కూడా తను ఓటీటీలోనే రిలీజ్ చేస్తారని అందరూ భావంచారు. కానీ, ఇప్పుడు అచార్య వస్తున్న రోజే సూర్య కూడా తన సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. చూడాలి మరి రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందో.