Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో దాదాపు 150 సినిమాలు చేయడం జరిగింది. ఇండస్ట్రీలో స్వయంకృషితో కష్టపడి పైకి వచ్చి.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణా లాంటివారు ఉన్న సమయంలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనం అధిరోహించి అనేక రికార్డులు చిరంజీవి సృష్టించడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి డాన్సర్ గా మాత్రమేకాక మాస్ ఫాలోయింగ్ కలిగిన హీరోగా తిరుగులేని క్రేజ్ ప్రేక్షకులలో దక్కించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమా రంగంలో అడుగు పెట్టిన చిరంజీవి ప్రస్తుతం… అనేక సినిమాలు ఒప్పుకుని మళ్లీ అభిమానులను అలరిస్తున్నారు.
ఇదిలా ఉంటే తన ఇప్పటివరకు కెరియర్లో తాను చేయలేనిది చరణ్ చేస్తున్నాడని తాజాగా శంకర్ దర్శకత్వంలో చరణ్ నటించడాన్ని గురించి సన్నిహితులతో అన్నట్లు వార్తలు వచ్చాయి. శంకర్ దర్శకత్వంలో ఎప్పటినుండో చేయాలని తన కోరిక అన్నట్లు చిరంజీవి తెలిపినట్లు ఆ వార్తల సారాంశం. ఇదిలా ఉంటే శంకర్ దర్శకత్వంలో 15 సినిమాకి చరణ్ కి అవకాశం రావటం అనేది మామూలు విషయం కాదని ఆ సినిమా స్టోరీ చాలా బాగుందని విన్న వెంటనే చాలా ఎగ్జైట్ అయినట్లు చిరంజీవి తెలిపారట.
Read More: Ram charan : మూడు భాషలలో చరణ్ 15..?
ఏది ఏమైనా దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఈ సినిమా భారీ రేంజ్ లో ఆడాలని.. మంచి విజయం సాధించాలని చిరంజీవి కోరుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. చాలా వరకు రష్మిక మందన అని అంటున్నారు. మరి అధికారికంగా మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. మ్యూజిక్ పరంగా తమన్.. డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నీ అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించడం జరిగింది.