Deepti Sunaina : సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన జంటలలో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా జంట కూడా ఒకటి. షణ్ముఖ్ యూట్యూబ్ స్టార్ గా చాలా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్-5లో కూడా ఎంట్రీ ఇచ్చి టైటిల్ రన్నర్ గా నిలిచి మరింత పాపులర్ అయ్యాడు.బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయితే అయ్యాడుగాని హౌస్ లో షణ్ముఖ్ సిరితో క్లోజ్ గా మూవ్ అవ్వడం పట్ల ప్రేక్షకులలో కొంత నెగటివిటీ కూడా వచ్చింది. సిరితో రిలేషన్ కారణంగా బిగ్ బాస్ విన్నర్ కావలిసిన షన్ను రన్నరప్‌గా నిలిచాడని సోషల్ మీడియోలో రూమర్లు కూడా వచ్చాయి.
Deepti Sunaina : హౌస్ లోకి వచ్చే ముందే షణ్ముఖ్, దీప్తి ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారా… లేరా..?
ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే ముందే సిరికి శ్రీహాన్‌తో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అలాగే షణ్నూ కూడా దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నాడు. ఇలా ఇద్దరూ కూడా వేరే వాళ్ళతో రిలేషన్ షిప్లో ఉండి, మితిమీరిన హగ్గులతో రెచ్చిపోయారు. ఫలితంగా ఆడియెన్స్ కు వీరి రేలషన్ షిప్ పట్ల నెగటివిటి ఏర్పడింది. సోషల్ మీడియాలో సైతం వీరిద్దరి గురించి విపరీతమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు. షన్ను విషయంలో దీప్తి మాత్రం చాలా హర్ట్ అయినట్లు తెలుస్తుంది.
షణ్ముఖ్ ను దీప్తి దూరం పెట్టడానికి గల కారణం ఏంటంటే..?
బిగ్ బాస్ హౌస్ నుంచి షన్ను బయటకు వచ్చాక అతనితో మాట్లాడలేదు దీప్తి. సోషల్ మీడియాలో సైతం పెద్దగా యాక్టీవ్ గా లేదు దీప్తి.. వీరిద్దరికి బ్రేక్ అప్ అయిందా అని సోషల్ మీడియాలో చాలా రకాల రూమర్లు చెక్కర్లు కొట్టాయి. వాటన్నిటికీ చెక్ పెడుతూ ఇటీవలే దీప్తి షన్నుకు బ్రేక్ చెప్పేసింది. ఇకనుండి అయినా కెరీర్ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నా అని షన్నుతో బ్రేక్ అప్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. దీప్తి అభిప్రాయాన్ని కూడా షన్ను స్వాగతించాడు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా అని రిప్లై ఇచ్చాడు. ఇటీవల దీప్తి పుట్టినరోజున కూడా షన్ను దీప్తికి తనదైన స్టైల్లో విషెస్ చెప్పాడు.
Deepti Sunaina : లవ్ షో నిర్వహించిన షన్ను… నెటిజన్లు ఎలాంటి ప్రశ్నలు అడిగారో తెలుసా..?
కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన షణ్నూ మళ్ళీ ఇన్ని రోజులకు తాజాగా ఇన్‌స్టాలో లైవ్ సెషన్ నిర్వహించాడు.ఈ క్రమంలో అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాడు షన్ను. అయితే చాలామంది అభిమానులు షన్నును దీప్తి సునయన గురించి అడగగా షణ్నూ వాళ్లందరికీ సమాధానం ఇలా చెప్పుకొచ్చాడు ‘ప్రస్తుతం దీప్తి తనని బ్లాక్ చేసిందని చెప్పుకొచ్చాడు ఇలా మెసేజెస్ రూపంలో కాకుండా తానే డైరెక్ట్ గా త్వరలోనే హైదరాబాద్ వెళ్లి దీప్తిని కలుస్తానని చెప్పుకొచ్చాడు.
మరి సిరి గురించి షన్ను ఏమ్మన్నాడంటే..?
అంతేకాకుండా దీపు నా వల్ల నెటిజన్ల నుండి చాలా నెగిటివిటిని ఫేస్ చేసి మరి నాకోసం నిలబడింది. అలాంటి అమ్మాయిని వదులుకోను.తప్పకుండా వెళ్లి దీప్తితో మాట్లాడతాను అని చెప్పుకొచ్చాడు. అలాగే తనతో బ్రేకప్ అయితే జరగదు అని,నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు నేను దీపును వదలే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చాడు.దీప్తిని ఎలా అయితే ప్రేమిస్తున్నానో, అలాగే సిరితో కూడా తన ఫ్రెండ్షిప్ కూడా ఇలానే కంటిన్యూ అవుతుందని చెప్పాడు. సిరితో పాటుగా జెస్సీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అని అందరికి తెలిపాడు.