NewsOrbit
న్యూస్ హెల్త్

Fitness: శరీరం సన్నగా ఉన్న పొట్ట మాత్రం పెద్దగా కనిపిస్తుందా?

Fitness: బొజ్జ రావడం వెనుక
బరువు పెరగడం వల్లే పొట్ట వస్తుందని అనుకుంటూ ఉంటారు చాలామంది. అయితే, బరువు పెరిగే ప్రతి ఒక్కరికీ పొట్ట ఉంటుంది అని అనుకోవడం పొరపాటే.  అయితే, పొట్ట పెరగడానికి  మనం చేసే  చిన్న చిన్న  పొరపాటులే  కారణం అని గుర్తు పెట్టుకోవాలి. ఊబకాయం లేని వ్యక్తులలో   కూడా పొట్ట బయటకు వచ్చి కనిపిస్తుంటుంది.    అయితే, ఈ బొజ్జ రావడం వెనుక  చాలా కారణా లు ఉన్నాయి అనే చెప్పాలి.   అందులో ఒకటి గ్యాస్ లేదా గాలి వల్ల పొట్ట పెద్దగా కనబడవచ్చు. రెండోది మనం  తీసుకునే  ఆహారం వల్ల కూడా కావచ్చు. మూడోది  పొట్ట వద్ద పేరుకుపోయే కొవ్వుల వల్ల కూడా  పొట్ట పెద్దగా కనిపించవచ్చు.

Overweight man

 

Fitness: హడావుడి

ఆహారం తినే విధానం వల్ల కూడా  పొట్ట  పెరిగే అవకాశం ఉంది.  హడావుడిగా ఆహారం తినే అలవాటు వలన మధ్యలో   గాలిని కూడా  మింగేస్తుంటారు అని నిపుణులు తెలిపారు.   అప్పుడు    ఆ గాలి  ఊపిరితీత్తుల్లోకి చేరకుండా అన్నవాహికలో తిష్ట   వేసుకుని అది పెద్ద ప్రేగుల్లోకి చేరి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. అందుకే, కొందరికి ఆహారం తీసుకున్న  తర్వాత పొట్ట తన్నుకుని  వస్తుంటుంది. అయితే,ఇలా వచ్చిన పొట్ట  ఇది తాత్కాలికమే.  రోజూ అదే  హడావుడితో  తింటే మాత్రం  ఆ పొట్ట అలాగే పెద్దగా ఉండిపోతుంది.  అందుకే  ఆహారాన్ని నిదానంగా నమిలి నమిలి  తినాలి. ఆహారం తినడానికి వీలైనంత ఎక్కువ సమయాన్ని తీసుకోవాలి. టీవీ,ఫోన్  చూస్తూ పరధ్యానంతో  తినకూడదు.  నెమ్మ,నెమ్మదిగా నములుతూ రుచిని ఆస్వాదిస్తూ తినాలి. ఆహారాన్ని మింగడానికి ముందు కనీసం లో కనీసం  30 సార్ల పాటు  నోటిలో ఉంచుకుని నమాలి.

పొట్ట  బయటకు

మనం  తాగే  కూల్ డ్రింక్స్ కూడా పొట్టను  పెంచేస్తాయి. గ్యాస్ సమస్యలు రావడానికి కూడా కారణం అవుతుంది.  ప్రదానం గా  కార్బోనేటేడ్ డ్రింక్స్‌లో కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. వాటిలో ఉండే గ్యాస్  పొట్టను  బయటకు తన్నుకొచ్చేలా చేస్తుంది. డైట్ డ్రింక్స్‌లో ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు  ఈ సమస్యను మరింత  పెరిగేలా చేస్తాయి.    గ్యాస్ సమస్యల  తో పొట్ట ఉబ్బితే.. నీళ్లు మాత్రమే తాగాలని నిపుణులు తెలియ చేస్తున్నారు.  బయటకు వెళ్లినప్పుడు..  పొట్ట  బయటకు తన్నుకు రాకుండా ఉండాలంటే  పళ్ల రసాలు ,కూల్ డ్రింక్స్, బీర్  తాగడానికి  బదులుగా , వైన్ తాగవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే వైన్‌లో పేగుల్లో మంచి బ్యాక్టీరియా  పెంచి ఉబ్బరాన్ని తగ్గించే  కారకాలు ఉంటాయట.

చాలామంది  స్త్రీలకు పీరియడ్స్ ప్రారంభానికి ముందు కూడా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.  నెలసరి సమయం లో  రక్తస్రావం ఉండడం తో పాటు ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరాన్, స్థాయిలలో వచ్చే  మార్పుల వల్ల కూడా శరీరంలో మరింత నీరు, ఉప్పు నిల్వలు పెరుగుతాయి.  ఈ కారణం గా  శరీరంలోని కణాలు నీటిలో ఉబ్బిన  ఫీలింగ్ ని  కలిగిస్తాయి. ఉప్పగా ఉండే ఆహారం, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లు  తీసుకోక పోవడం వలన   ఈ సమస్యను నివారించుకోవచ్చు. ఆ  సమయం లో బచ్చలి కూర, చిలకడ దుంప,  అవకాడోలు, అరటిపండ్లు,టొమాటోలు వంటి పొటాషియం  ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
పెద్ద పేగులో మలం ఎక్కువసేపు ఉండి అది  గ్యాస్, ఉబ్బరాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన ఈ సమస్య తగ్గుతుంది.  ఫైబర్ ఉన్న  ఆహారం ఎక్కువ సేపు పెద్ద పేగులో నిల్వ  ఉండకుండా  సులభం గా విసర్జన  జరిగేలా  చేస్తుంది. బాగా  నీరు తాగడం, వ్యాయామం చేయడం వల్ల  కూడా పేగులు  కదిలి    గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju