17 ఏళ్ల అమ్మాయికి గుండు కొట్టించారు.. తల్లిదండ్రులపై దేశ బహిష్కరణ!

కులాంతర వివాహాల పట్ల నేటి సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. ఎంతో మంది తల్లదండ్రులు తమ పిల్లలు కులాంతర వివాహం చేసుకున్నారని దారుణంగా చంపుతున్నారు. ఇలాంటి వార్తలు ప్రతిరోజూ మనం వార్తల్లోనూ చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు చాలా సాధారణం. కాని తల్లిదండ్రులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

తమ సంతోషమే కోరుకున్నా.. వారి ఆవేశాల కారణంగా ఎంతటి దారుణానికైనా సిద్ధమవుతున్నారు. ప్రేమ అనేది వారి రూపురేఖలు, కులం, ఆస్తి అంతస్థులు చూసి పుట్టదని తెలుపుతారు. కాని వారి ప్రేమను కులంతో ముడిపెట్టి విడదీస్తుంటారు. అలాంటి ఘటనే ప్రాన్స్ లో చోటుచేసుకుంది.

ఒక క్రిస్టియన్ తో ఓ బాలికకు స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. కాని అది తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు బాలికకు గుండు చేయించారు. దీంతో ఆ కుటుంబాన్ని తమ దేశం నుంచి బహిష్కరించినట్లు ఫ్రాన్స్ అంతర్గత మంత్రి జెరాల్డ్ డర్మానిన్ శనివారం తెలిపారు. బోస్నియా హెర్టెగోవినాకు చెందిన బాలిక(17) రెండెండ్ల కింద తన కుటుంబంతో ఫ్రాన్స్ కు వలస వచ్చి బెసాన్కాన్ నగరంలో నివసిస్తున్నది.

వారు ఉంటున్న బిల్డింగ్ లోని మరో పోర్షన్ లో నివాసం ఉంటున్న క్రిస్టియన్ సెర్బ్ యువకుడితో(20) ఆమెకు ప్రేమలో పడింది. వారిరువు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇదే విషయం గురించి వారు మాట్లాడుకుంటుండగా బాలిక కుటుంబ సభ్యులు విని బాలికను బంధించారు. అలాగే ‘మనం ముస్లింలు, అతను క్రిస్టియన్ నువ్వు పెండ్లి చేసుకోవడానికి కుదరదని బెదిరించి ఆ బాలికను కొట్టి గదిలో బంధించారు. తర్వాత బాలిక బాబాయి, పిన్ని కలిసి ఆమెకు గుండు కొట్టారు.

దీనితో ప్రేమికుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆ బాలికను విడిపించారు. తర్వాత ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలికను కుటుంబ సభ్యులు హింసించినట్లు కోర్టు నిర్ధారించింది. వారిని ఐదేండ్లపాటు దేశం నుంచి బహిస్కరిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే ఫ్రాన్స్ అధికారులు బాలికను సంరక్షణ కేంద్రంలో ఉంచారు.