Hyper Aadi: హైపర్ ఆది పై ప్రముఖ హీరోయిన్ కామెంట్స్ వైరల్..!

Share

బుల్లితెరపై హైపర్ ఆది చేసే హంగామా అంతా ఇంతా కాదు. తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షో ద్వారా మనకు పరిచయం అయ్యి అతి కొద్ది కాలంలోనే బెస్ట్ కామెడీ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. అతని కామెడీ టైమింగ్ కు ఎవరన్నా సరే కడుపు చెక్కలు అయ్యేలాగా నవ్వడం గ్యారంటీ. ఎదుటి వారి మాటలకు కామెంట్స్ చేయాలంటే ఆది తర్వాతే ఎవరన్నా అని చెప్పవచ్చు. అలాంటి మన హైపర్ ఆదిని నలుగురు హీరోయిన్స్ కలిసి ఒక ఆట ఆడుకున్నారు.

ఆదికి చుక్కలు చూపించిన హీరోయిన్స్:

దీపావళి పండగ(Deepavali) సందర్బంగా ఈటీవీ యాజమాన్యం తగ్గేదేలే అనే ఒక ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ కి సినీ నటి ప్రియమణి, రోజా, ఇంద్రజ(indraja) కూడా ప్రముఖ అతిధులుగా విచ్చేసారు. ప్రియమణి ఆదిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పైగా వీరి మధ్యలోకి రోజా, ఇంద్రజలను కూడా లాగేసింది ప్రియమణి. ఆ తరువాత ముగ్గురు కలిసి ఆదిని ఒక ఆట ఆడుకున్నారు.

డైరెక్టర్ అవతారం ఎత్తిన హైపర్ ఆది:


మల్లెమాల యాజమాన్యం దీపావళి పండగ సందర్బంగా తగ్గేదేలే అనే ప్రోగ్రాం కోసం జబర్దస్త్ ఆటం బాంబులను, చిచ్చరపిడుగుల్లాంటి హీరోయిన్స్ ని రంగంలోకి దింపింది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోగ్రాం ప్రోమో అందరిని బాగా అలరించింది అందులో సీనియర్ హీరోయిన్లు రోజా, ఇంద్రజ, ప్రియమణి సందడి బాగా ఎంటర్టైన్మెంట్ గా సాగింది. ఇక జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో హీరోయిన్స్ వేసిన ఓ స్కిట్ కడుపుబ్బా నవ్వించింది. మూవీ డైరెక్టర్ అవతారమెత్తిన హైపర్ ఆది ఐదుగురు హీరోయిన్లతో మూవీ ప్లాన్ చేశాడు.

ఆదిని ‘బోకడా’ అన్న ప్రియమణి(priyamami):

ఈ స్కీట్ లో భాగంగా ముందుగా చామంతి పూవా అంటూ సూపర్ హిట్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది రోజా. ఆ తర్వాత ఇంద్రజ, ప్రియమణి ఎంటరయ్యారు. అయితే ప్రియమణి రాగానే ఆది తనలోని రొమాంటిక్ యాంగిల్ బయటపెట్టి రాగానే డైరెక్టర్ గారికి ఓ హగ్ ఇవ్వాలని తెలియదా అని అనేశాడు. దీంతో ప్రియమణి షాక్ అయ్యి అదిరిపోయే పంచ్ విసిరింది. రోజా, ఇంద్రజలను ఉద్దేశిస్తూ ఆల్రెడీ మా అమ్మ, అత్త క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకున్నారుగా అని అడిగింది. దీంతో ఒక్కసారిగా షాకైపోయారు ఆ ఇద్దరూ. ఆ వెంటనే హైపర్ ఆది అందుకొని వాళ్లిద్దరు కూడా మీలాగానే హీరోయిన్సే అనడంతో ప్రియమణి ‘ముందే చెప్పాలి కదరా బొకడా’ అంటూ అందరి ముందే హైపర్ ఆది పరువు తీసింది ప్రియమణి.


Share

Related posts

అడవి శేష్ ఇన్నాళ్ళు చేసిన సినిమాలన్ని ఒకటైతే మేజర్ ఒక్కటే ఒకటని మహేష్ బాబు ఎలా ఫిక్సైయ్యాడు ..?

GRK

Telangana : ఉద్యోగాల భర్తీపై లొల్లి!తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య సవాళ్లు ..ప్రతి సవాళ్లు!!

Yandamuri

బ్రేకింగ్ : ఏపీ లో స్కూళ్ళు తెరుచుకునే తేదీ చెప్పేసిన జగన్..? ఆ రోజే పిల్లలకు జగనన్న గిఫ్ట్

arun kanna