Anchor suma : యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. తెలుగు బుల్లితెర ఒంటి చేత్తో దశాబ్దాల నుంచి ఏలుతోంది సుమ. తను ఎంత మాటకారో.. ఎంత స్పాంటెనిటీతో మాట్లాడుతుందో అందరికీ తెలుసు. తను ఎక్కడుంటే అక్కడ సందడే. తను మాట్లాడుతుంటే వేరే వాళ్లు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎవరైనా తనతో పిచ్చి పిచ్చిగా మాట్లాడినా.. వెంటనే వాళ్లకు పంచులు వేస్తుంది. వాళ్ల నోరు మూయిస్తుంది. యాంకర్ సుమతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలు కానీ.. గెస్టులు కానీ.. తన షోకు వెళ్తే.. చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. లేదంటే తను వేసే పంచులకు తట్టుకోలేరు కాబట్టి.

Anchor Suma : Start Music షోలో జబర్దస్త్ కమెడియన్లు
స్టార్ మాలో ప్రసారమయ్యే స్టార్ట్ మ్యూజిక్ షో గురించి తెలుసు కదా. ఈ షోకు యాంకర్ గా సుమ వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షోకు గెస్టులుగా జబర్దస్త్ కమెడియన్లు.. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, శ్రీను, రైజింగ్ రాజు వచ్చారు. మామూలుగా వీళ్లంతా ఒక చోట కలిస్తేనే సందడి మామూలుగా ఉండదు.
ఇక.. సుమ షోకు వచ్చాక ఇంకెంత సందడి ఉండాలి. అయితే.. సుమ ఎంత హైపర్ యాక్టివో.. ఆది కూడా అంతే. అందుకే కదా.. ఆయన పేరులో హైపర్ అని ఉంది. టకటకా జోకులు, పంచులు వేస్తూనే ఉంటాడు.
అలాగే.. యాంకర్ సుమకు కూడా బీభత్సమైన పంచ్ ఇచ్చేశాడు ఆది. ఆమె బాగా తెలుసు.. ఎవరిని ఎక్కడ కట్ చేయాలో.. అందుకే పెద్దపెద్దోళ్లు అంటారు.. సుమ షో అంటే మమ అనుకోవడం తప్పితే మనకేమీ ఉండదని.. అంటూ బీభత్సమైన పంచ్ వేశాడు ఆది. మనోడి పంచ్ కు సుమ మాత్రం పగలబడి నవ్వింది. ఏది ఏమైనా ఇదంతా కామెడీ కోసమే.. జనాలను నవ్వించడం కోసమే కాబట్టి.. సుమ కూడా హైపర్ ఆది పంచులను లైట్ తీసుకుంది.
స్టార్ట్ మ్యూజిక్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసేయండి.