Payal Rajput: సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన అజయ్ భూపతి దర్శకుడుగా మారుతూ రూపొందించిన సినిమా ‘ఆర్ ఎక్స్ 100’. కార్తికేయ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా కార్తికేయకు రెండవ సినిమా. పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలో మంచి బోల్డ్ పాత్ర చేసి టాలీవుడ్ లో విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. అయితే ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా ప్రభావం పాయల్‌పై బాగా పడటంతో అనీ ఆ తరహా కథలే ఆమెకు వచ్చాయి. దాదాపు 70 నుంచి 80 కథలు విన్న పాయల్‌కు ప్రతీ సినిమాలోనూ ‘ఆర్ ఎక్స్ 100’ మూవీలో మాదిరిగానే ముద్దులు పెట్టాలి, బోల్డ్‌గా నటించాలని చెప్పారట.
దాంతో పాయల్ అలా వచ్చిన అవకాశాలను వదిలేసుకుంది. ఫైనల్‌గా ఆర్ డి ఎక్స్ లవ్ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో కూడా పాయల్ చేసింది బోల్డ్ పాత్రే. కానీ ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా రేంజ్లో మాత్రం హిట్ అవలేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ సినిమా అనేది ఒకటుందా అని ఆలోచిస్తారు. దాంతో పాయల్ అనుకున్న అవకాశాలు దక్కించుకోలేకపోయింది. వరుసగా ఫొటోషూట్స్‌తో ఇండస్ట్రీ వర్గాలకు, అభిమానులకు టచ్‌లో ఉన్న పాయల్ వెంకటేశ్‌తో వెంకీ మామ, రవితేజతో డిస్కోరాజా సినిమాలు చేసే
అవకాశం అందుకుంది.
Payal Rajput: పాయల్ పోస్ట్ చేస్తున్న ఫొటోలకు లైక్స్, కామెంట్స్, షేర్స్ వస్తున్నాయి..
కానీ, పాయల్ బ్యాడ్‌లక్ ఈ రెండు సినిమాల వల్ల ఆమెకు ఒరిగిందేమీ లేదు. వెంకీ మామ సూపర్ హిట్ అయినా పాయల్‌కు ఆ సక్సెస్ అసలు ఉపయోగపడలేదు. ఇక డిస్కోరాజా సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. దాంతో మళ్ళీ మంచి క్రేజీ ఆఫర్ దక్కించుకోలేకపోయింది పాయల్. అందుకే కాస్త గ్లామర్ డోస్ పెంచి ఎప్పటికప్పుడు
లేటెస్ట్ ఫొటోషూట్స్ నిర్వహిస్తోంది. అంతేకాదు ఆ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు షేర్ చేస్తోంది. ఇదంతా కేవలం టాలీవుడ్లో హీరోయిన్ అవకాశాల కోసమేనట. అయితే పాయల్ పోస్ట్ చేస్తున్న ఫొటోలకు లైక్స్, కామెంట్స్, షేర్స్ వస్తున్నాయి గానీ సినిమాలలో అవకాశాలు మాత్రం దక్కడం లేదు.