NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Jagan KCR: మోడీతో జగన్, కేసిఆర్ అప్పుడు ఊ.. అంటారా..? ఊహూ.. అంటారా..?

Jagan KCR: అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు మూడు రకాల అజెండాలు ఉంటాయి. ఒకటి పొలిటికల్ (రాజకీయ) అజెండా, రెండు ప్రభుత్వ అజెండా, మూడు. వ్యక్తిగత అజెండా. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో నిధులు రాబట్టుకుని ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా రాష్ట్రంలో మైలేజ్ తెచ్చుకోవడం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో వ్యక్తిగత వ్యవహారాలను చక్కబెట్టుకోవడం లాంటివి ఉంటాయి. అందుకే ప్రాంతీయ పార్టీలు చాలా వరకు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబందాలు నెరుపుకోవడం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్ లు ఇప్పటి వరకూ అదే విధంగా ఉన్నట్లు అందరికీ తెలిసిందే. ఇరు రాష్ట్రాల పాలకులు ఢిల్లీలో ఒక వైఖరి, రాష్ట్రంలో ఒక వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. రాష్ట్రాల్లో తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీని ఎగర్తిస్తున్నట్లుగా కనబడుతూనే కేంద్రంలో మాత్రం బీజేపీకి అవసరమైన (కీలక బిల్లుల ఆమోదం)  సందర్భాలలో మద్దతు ఇస్తూ వస్తున్నారు.

Jagan KCR: కేంద్రంపై నిప్పులు చెరిగిన కేసిఆర్

ఇంతకు ముందు పలు కేంద్రంలో కీలక బిల్లుల విషయంలో మద్దతు ఇచ్చి మరీ రాష్ట్రంలో దానికి భిన్నంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. కేంద్రంతో సఖ్యతగా ఉన్నా తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ లో మొండి చేయి చూపించింది. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీల కింద దాదాపు 23వేల కోట్లు జగన్ సర్కార్ ఆశించింది. అయితే బడ్జెట్ లో కేంద్రం ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు. అదే విధంగా తెలంగాణలో అనేక ప్రాజెక్టులు, నిధుల కోసం రెండు నెలలుగా కేసిఆర్ సర్కార్ లేఖలు రాస్తున్నా నిధుల కేటాయింపు జరగలేదు.  దీంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ సీఎం కేసిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ  నిప్పులు చెరిగారు. కానీ ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం మీడియా ముందుకు రాలేదు. ఏమి మాట్లాడలేదు. ప్రకటన కూడా విడుదల చేయలేదు.

 

ఈ రెండు పార్టీల స్టాండ్ ఎటు..?

త్వరలో ఈ రెండు రాష్ట్రాల అధికార పార్టీల అవసరం కేంద్రంలోని బీజేపికి రానున్నది. అప్పుడు వీరు ఏ రకమైన స్టాండ్ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఈ ఏడాది జూలై నెలలో రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఆ ఎన్నికల్లో గెలుపునకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు ఉన్న వైసీపీ, టీఆర్ఎస్ లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇప్పటి వరకూ లోపాయికారీ వ్యవహారాలతో కేంద్రంతో రహస్య స్నేహం చేస్తూ వచ్చిన ఈ రెండు పార్టీలు ఎటువంటి స్టాండ్ తీసుకుంటాయి అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఉంది. రాష్ట్రాలకు మోసం చేస్తున్న బీజేపీకి సహకరిస్తాయా..? లేదా అనేది వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju