NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వాలంటీర్ల నెత్తిన పిడుగు వేసిన జగన్ : వారంతా ఇంటికే ఇక

 

జగన్ దత్త పుత్రిక అయిన వాలంటీర్ల వ్యవస్థకు తాజాగా ఇచ్చిన షాక్ మాములుగా లేదు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం వేల సంఖ్యలో వాలంటీర్లు తమ ఉద్యోగాన్ని కోల్పోనున్నారు. ప్రభత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇటు వైస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను సైతం నివ్వెర పరుస్తోంది. ఎప్పటికి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ మీద ఎంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియక ఎందరో లబోదిబోమంటున్నారు.

ఇంతకీ ఏమిటా నిర్ణయం అంటే ??

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వం నియమించిన వలంటీర్లకు 35 ఏళ్ల వయసు నిండితే ఉద్యోగం నుంచి తొలగించాల్సిందిగా ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారితో పాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వలంటీరు సచివాలయం, వార్డు వలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌.నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వలంటీర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడడ్డారు. ఇప్పటికే వాలంటీర్లు నవరత్నాల అమలు తో పాటు ప్రభుత్వ అధికారులు చెప్పే పనుల్లో చురుగ్గా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పని అయిన వీరే ముందుండి చేస్తున్నారు. అధికారులు వీరికే కింది స్థాయి పనులు అప్పగిస్తున్నారు. ఇంటి ఇంటికి వెళ్లి పనులు చేయడంలో వలంటీర్ల వ్యవస్థ విజయం సాధించింది అని చెప్పాలి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలు పెట్టిన కార్యక్రమాల్లో అత్యంత సక్సెస్ అయ్యిన ప్రోగ్రాం కూడా ఇదే. అయితే ఎప్పడు ఉన్నట్టుండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాప్రతినిధులకు సైతం అంతు పట్టడం లేదు.
** 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 2.60లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లుగా నియమించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించారు. వలంటీర్ల సంఖ్య ప్రతి జిల్లాలో 20వేల నుంచి 30వేల మంది వరకు ఉన్నారు. గ్రామ వలంటీర్లుగా ఎంపికైన వారిలో చాలా మంది అధికార పార్టీ అనుచరులు, రికమండేషన్లతో వచ్చిన వారే ఉన్నారు. నాయకుల వెనుక తిరిగిన వారికీ ఏది ఒక పని కల్పించేందుకు వాలంటీర్ల పథకం బాగానే పనికి వచ్చింది. ఎన్నికల్లో తమ కోసం తిరిగిన వారికీ ఓ ఉద్యోగం వేయించామన్న ధీమా ఉండేది. వీరు సైతం క్షేత్రస్థాయిలో తిరుగుతూ దాదాపు ఏడాదిన్నరగా వీరంతా ఇంటింటికీ పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను చేరవేస్తున్నారు. 2021 జనవరి నుంచి రేషన్ సరుకులు కూడా వీరే సరఫరా చేయనున్నారు. వచ్చే కాలం లో వీరు చేసే పనులు ఇంకా పెరిగే అవకాశం ఉంది.


** ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో నియామకాలు చేపట్టేనాటికి 18 ఏళ్ల లోపు, 35 ఏళ్లు వయసు పైబడిన వారు ఉద్వాసనకు గురయ్యారు. ఇప్పటికే 35 ఏళ్లు నిండి వలంటీరుగా పనిచేస్తున్న వారికి సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు రావడాం లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 35 ఏళ్లు నిండిన వలంటీర్ల నియామకం జరిగిన దృష్ట్యా వారిని విధుల నుంచి తొలగించాలని, ఆ ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వలంటీర్లలో ఆందోళన నెలకొంది. సర్కారు నిబంధనలు అనుసరించి 35 సంవత్సరాలు దాటి ఒక్కరోజు ఉన్నా సరే సదరు వలంటీరును ఉద్యోగం నుంచి తొలగిస్తారు. తాజా ఉత్తర్వులతో ఉద్యోగం కోల్పోతున్నవారి సంఖ్య వేలల్లోనే ఉండనుంది. సుమారు 30 నుంచి 45 వేల మధ్యలో ఉద్యోగాలు పోనున్నాయని అంచనా.
** వలంటీర్ల నియామక సమయంలో చదువు కొనసాగిస్తున్నవారు, ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నవారిని అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఐతే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వలంటీర్ ఉద్యోగాన్ని పార్ట్ టైమ్ జాబ్ గా భావిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల వీరిపై అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. కేవలం యువతను మాత్రమే వాలంటీర్లుగా ఉంచి, వారికీ మరిన్ని బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

author avatar
Special Bureau

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju