NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అక్కడ జ‌గ‌న్‌ది ఓ బాధ‌… చంద్ర‌బాబుది మ‌రో బాధ‌…!

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మిగ‌నూరులో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అదికార పార్టీ వైసీపీలో అస‌మ్మ‌తి బెడ‌ద జోరుగా వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్న‌కేశ‌వ‌రెడ్డి.. వ‌యోవృద్ధుడ‌నే కార‌ణంగా ఆయ‌న‌ను త‌ప్పించారు. దీంతో ఆయ‌న సూచించిన వారికి తొలుత ఇంచార్జ్ బాధ్య‌త‌లు ఇచ్చారు. త‌ర్వాత అనూహ్యంగా ఆయ‌న గ్రాఫ్ బాగోల‌దంటూ.. మాజీ ఎంపీ బుట్టా రేణుక‌కు అవ‌కాశం ఇచ్చారు. దీంతో స్థానిక నాయ‌క‌త్వం .. ఆమెతో క‌లిసి పనిచేసేది లేద‌ని.. తిరిగి సిట్టింగుకే సీటు ఇవ్వాల‌ని లేదా.. వేరేవారిని కేటాయించాల‌ని ర‌గ‌డ చేస్తోంది. ఈ ప‌రిణామం వైసీపీలో సెగ పెడుతోంది.

ఇక‌, టీడీపీలోనూ మ‌రో ర‌గ‌డ తెర‌మీదికి వ‌చ్చింది. ఈ పార్టీ ఇంకా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. దీంతో బీసీలు అధికంగా ఉండే నియోజకవర్గం కావ‌డంతో ఎమ్మెల్యే టికెట్‌ను బీసీ వర్గానికి కేటాయించాలని బీసీ ఐక్యవేదిక టీడీపీని డిమాండ్ చేస్తోంది. తాజాగా 30 కులాల బీసీ నాయకులు భారీ ఎత్తులో నిర్వ‌హించిన స‌మావేశంలో ఈ మేర‌కు తీర్మానం కూడా చేసేశారు. టీడీపీకి బీసీలు వెన్నెముకలా ఉన్నారని, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 1975 నుండి బీసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పార్టీలు టికెట్లు ఇవ్వలేదని ఇప్పుడైనా బీసీకి టికెట్ ఇవ్వాలని వివిధ కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

త‌మ డిమాండ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సానుకూలంగా స్పందించాలని నాయకులు అభిప్రాయపడ్డారు. మాచాని సోమప్ప ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఎనలేని కృషి చేశారని, ఇప్పుడు వారి ముని మనవడు డాక్టర్ మాచాని సోమనాథ్ టీడీపీ నుండి ఎమ్మెల్యేగా నిలబడడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. నిలబడడానికి సిద్ధమైన తరుణంలో వారికి ఎమ్మెల్యే టికెట్‌ను ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుని అధిష్టానానికి బహుమతిగా ఇస్తామని, ఈ బాధ్యతను తాము స్వీకరిస్తామని కొందరు బీసీ నేతలు తెలియజేశారు. బీసీల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. దీంతో టీడీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప్రారంభ‌మైంది.

వైసీపీ తీసుకున్న నిర్ణ‌యం ఇక్క‌డ రాజ‌కీయాల‌ను రాజేసింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఆది నుంచి అంటే.. 2004 నుంచి ఇక్క‌డ రెండు కీల‌క పార్టీలు కూడా రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌లకే టికెట్లు ఇస్తున్నాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్న‌కేశ‌వ రెడ్డి, టీడీపీ నుంచి బీవీ మోహ‌న్‌రెడ్డి పోటీ చేయ‌గా చెన్న‌కేశ‌వ‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. 2009లో ఈ రెండు పార్టీలూ వీరికే టికెట్లు ఇవ్వ‌గా.. మూడో పార్టీ ప్ర‌జారాజ్యం కూడా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ల‌క్ష్మీకాంత‌రెడ్డికే టికెట్ ఇచ్చింది. 2012 ఉప‌పోరులో చెన్న‌కేశ‌వ రెడ్డి వైసీపీ త‌ర‌ఫున‌, బీవీ మోహ‌న్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు.

2014లో టీడీపీ బీవీ జ‌య‌నాగేశ్వ‌ర‌రెడ్డికి అవ‌కాశం ఇవ్వ‌గా ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇదే ఎన్నిక‌ల్లో వైసీపీ కె. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ చెన్న‌కేశ‌వ‌రెడ్డికి ఇచ్చింది. ఈయ‌న గెలిచారు. టీడీపీ జ‌య‌నాగేశ్వ‌ర్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇలా.. ఇప్ప‌టి వ‌ర‌కు 4 ఎన్నిక‌ల నుంచి రెడ్డి వ‌ర్గ‌మే ఉంది. కానీ, ఇప్పుడు వైసీపీ బీసీ మంత్రం పఠించింది. దీంతో ఇక్క‌డ వివాదాల‌కు దారితీస్తోంది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju