NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నోరెత్తకుండానే బాబు పని పడుతున్న జగన్..! పీకే స్త్రాటేజీ పనిచేస్తోంది

మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినా కూడా జగన్ ప్రతిపక్షానికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర పాలనలో తన మార్క్ ను ఏర్పరుచుకుని ముందుకు వెళ్తున్నాడు. రఘురామకృష్ణంరాజు, హైకోర్టు వంటి అడ్డంకులు వచ్చినా కూడా అవేమీ అతనికి అంత పెద్ద తలనొప్పి కాలేదు. క్యాబినెట్ పరంగా గానీ.. పాలన వ్యవహారాల్లో గాని జగన్ కి పెద్ద సవాళ్ళు లేకపోగా…. అతనే తనకు తానే మూడు రాజధానులు, ఇంగ్లీష్ మీడియం, మద్య నియంత్రణ అంటూ కొత్త సవాళ్లను విసురుకుంటూ ముందుకు పోతున్నాడు.

 

YS Jagan for Europe - Chandra Babu for USA! | TeluguBulletin.com

అయితే ఈ సమయంలో ప్రతిపక్షం దొరికిన చోటల్లా జగన్ పై విరుచుకు పడేందుకు…. అతని పై విరుచుకుపడటం తప్ప తమకు ఇంకా ఏమీ తెలియదన్నాట్టు వ్యవహరిస్తున్నప్పుడు జగన్ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు అతని కొడుకు అశ్మిత్ రెడ్డి ల అరెస్టు, తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంబంధీకులు అరెస్టు కూడా జరిగింది. వీటన్నింటిలో లోకేష్, చంద్రబాబు అచ్చెన్నాయుడు వ్యవహారం అప్పుడు పెద్ద రచ్చే చేశారు. ఆ తర్వాత అదే ఫ్లో కంటిన్యూ చేసినా క్రమంగా ఎవరూ పట్టించుకోలేదు.

“ఇదేంట్రా మేము ప్రతిపక్షంగా మేము అసలు ఉన్నామని రాష్ట్రంలో ప్రజలు గుర్తించట్లేదు” అని టిడిపి వారు బిత్తరచూపులు చూస్తున్న దానికి అసలైన కారణం జగన్ మౌనం. ఇప్పుడు వారు చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తే న్యూస్ అనేది మరింతగా స్పీడ్ అవుతుంది.. లేదంటే నాలుగు రోజులు వీరి మాటలు విని వీరికి ఇదెప్పుడూ కామనే.. మాటలు తప్ప చేతలు లేవు అని ప్రజలు కూడా లైట్ తీసుకుంటారు. ఇదే స్ట్రాటజీని ప్రశాంత్ కిషోర్ గత ఏడాది ఎన్నికల ముందు అమలు చేశారు. ముఖ్యంగా అతను ఏ రాష్ట్రంలో ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించినా కూడా ముందుగా చేసే పని ఇదే. అధికార పక్షం వైపు వ్యవహరిస్తుంటే ప్రతిపక్షాన్ని పల్లెత్తు మాట కూడా అనరు. మేమేం చేశాం.. ఇంకేం చేయాలనుకుంటున్నాం.. ఇవి రెండే మాటలు. 

ఇక ప్రతి పక్షం వైపు ఉంటే మాత్రం వారిపై వచ్చిన్న వ్యక్తిగత దూషణలకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా కేవలం అధికారపక్షాన్ని పాలనా పరంగా పరంగా ప్రశ్నిస్తారు కానీ మీరు చేసింది తప్పు…. ఇది అన్యాయం…. అసాంఘికం అని చెప్పి పాచిపోయిన డైలాగులు వేసేందుకు మొగ్గుచూపడు. ఇక జగన్ ఇదే ఫార్ములా ను పాటించడం అతనికి ప్రస్తుతానికైతే మంచి చేస్తుంది అనే చెప్పాలి.

author avatar
arun kanna

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N