న్యూస్

Karthika Deepam Highlights: ఈ వారం కార్తీక దీపం సీరియల్ హై లైట్స్..!!

Share

Karthika Deepam Highlights:కార్తీక దీపం సీరియల్ ఈ వారం అంతా భలే రసవత్తరంగా సాగింది అనే చెప్పాలి. మరి ఈ వారం కార్తీక దీపం సీరియల్ లో చోటుచేసుకున్న హై లైట్స్ ఏంటో ఒక లుక్ వేద్దామా. ఎట్టకేలకే కార్తీక్ కుటుంబం అంతా తాడికొండ గ్రామానికే చేరుకుంటారు.మోనిత మాత్రం బొంబాయి హోటల్లో భోజనం చేసి తిరిగి వెళ్ళిపోతుంది.మోనితను చుసిన విషయం కార్తీక్ దీపకు చెబుతాడు. మొదట్లో దీప కాస్త కంగారు పడుతుంది కానీ తరువాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కార్తీక్ తో చెబుతుంది. మరో పక్క ఆనందరావు, సౌందర్య దంపతులు ప్రకృతి వైద్యశాలలో చికిత్స కోసం తాడికొండలోని ప్రకృతి ఆశ్రమానికి వస్తారు.మరోపక్క రుద్రాణి అప్పు ఎలా తీర్చాలి అని దీప ఆందోళన పడుతుంది.అలాగే బొంబాయి హోటల్లో పని చేస్తున్న కార్తీక్ కు అప్పారావు రెండు పార్సిల్స్ ఇచ్చి ఒకటి ప్రకృతి ఆశ్రమానికి మరొకటి రుద్రాణికి ఇచ్చిరావాలని చెబుతాడు. అలాగే తాడికొండలో రుద్రాణితో జాగ్రత్తగా ఉండాలని ముందుగానే హెచ్చరిస్తాడు.

Samantha: అది చాలా కష్టం ‘ మొహమాటం లేకుండా చెప్పేసిన సమంత — ‘ ఆ దేశం ‘ లో అడుగుపెడుతూనే బిగ్ నిర్ణయం !

Karthika Deepam Highlights: ప్రకృతి వైద్యాశాలలో తల్లి, తండ్రులను చుసిన కార్తీక్ :

ఇంతలో ప్రకృతి వైద్యశాలలో రూమ్ లో కూర్చున్న ఆనందరావు, సౌందర్య కార్తీక్ వాళ్ళను తలుచుకుంటూ బాధపడతారు. ఈలోపు కార్తీక్ సౌందర్య-ఆనందరావు ఉన్న రూమ్ లోకి భోజనం ఇవ్వడానికి వెళ్లి మంచంపై నిద్రపోతున్న తన తండ్రిని చూసి అవాక్ అవుతాడు.ఆస్థి అంతస్థు ఉన్నాగాని ఏమీలేనట్టు ఇక్కడ చేరారా అని బాధపడతాడు. సౌందర్య రావడం చూసి వాళ్ళకి కనిపించకుండా తలుపు చాటున దాక్కుంటాడు. భోజనం చేయమని సౌందర్య అంటే ఆకలిగా లేదు అంటాడు ఆనందరావు.భోజనం చేస్తుంటే నాకు పెద్దోడే గుర్తొస్తున్నాడు అని బాధపడతాడు.ఏధైనా జరగరానిది జరిగి ఒకవేళ నా ప్రాణాలు పోతే నాకు చివరి కర్మలకైనా వస్తాడో లేదో అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.వాళ్ళని చూసి గుండె నిండా భారంతో కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

Radhe shyam: ‘రాధేశ్యామ్’ చూశాక ఎవరైనా శంకర్ సినిమాలను మర్చిపోవాల్సిందే..!
రుద్రాణిని కొట్టిన సౌందర్య.. ఎందుకంటే..?

మరో పక్క రుద్రాణి పంపిన క్యారియర్ పిల్లలతో ఎలాగైనా తినిపించాలని రౌడీలు చూస్తే పిల్లలు తెలివిగా రౌడీలను బురిడీ కొట్టించి స్కూల్లో పిల్లలందరకీ ఆ భోజనం పెట్టేసి ఇంటికి వెళ్లిపోతారు. ఇక రుద్రాణి తన మనుషులతో ఏదో రిజిస్ట్రేషన్ పని మీద బయటకు వెళ్తూ ఉంటే రుద్రాణి దగ్గర పనిచేసే రౌడీ అబ్బులు ప్రకృతి ఆశ్రమం దగ్గర కారు ఆపి మా ఇంటి ఆవిడకి మందులు తీసుకోవాలి అని చెప్పి లోపలికి వెళ్తాడు.అప్పటికి ఆశ్రమంలో గురువుగారు సౌందర్య, ఆనందరావులు ధ్యానం చేస్తూ కళ్లు మూసుకుని ఉంటారు. ఇంతలో అబ్బులు వచ్చి ‘గురువుగారిని విసిగిస్తాడు.ధ్యానాన్ని పాడు చేస్తున్నాడానే కోపంతో సౌందర్య ఆ రౌడీ మీద సీరియస్ అవుతుంది. ఇంతలో రుద్రాణి అక్కడికి వచ్చి సౌందర్యతో అమర్యాదగా మాట్లేడే సరికి సౌందర్యకు కోపం. వచ్చిలాగి పెట్టి చెంప మీద ఒక్కటి ఇస్తుంది.వెంటనే రుద్రాణికి దీప కొట్టిన సీన్ గుర్తొచ్చి ‘నువ్వు రెండో దానివి అని కోపంతో నీ సంగతి తెలుస్తా అని వెళ్ళిపోతుంది.

Mahesh Babu: ఇందుకే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్లు క్యూ కట్టేది..!
ఆశ్రమానికి వెళ్లిన దీప అత్తా, మామలను. చూస్తుందా..?

రుద్రాణిని ఆశ్రమంలో ఎవరో ఒకావిడ చెంప దెబ్బ కొట్టిందనే విషయాన్నీ దీప తెలుసుకుని ఆవిడను చూడడానికి ఆశ్రమానికి వెళుతుంది దీప. లోపలికి వెళ్లిన దీప అక్కడ గదిలో సౌందర్య, ఆనందరావుని చూసి షాక్ అవుతుంది. ఏంటి అత్తయ్య మావయ్య ఇక్కడ ఉన్నారు అని బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. రుద్రాణిని కొట్టింది అత్తయ్యగారా అని అనుకుని వాళ్ళకి కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.మరోపక్క రుద్రాణి పిల్లలకు క్యారియర్ పంపించిందని తెలిసుకున్న కార్తీక్ కోపంతో రుద్రాణి దగ్గరకు వెళ్లి గట్టిగా అరుస్తాడు. కానీ రుద్రాణి కార్తీక్ మాటలు లెక్కచేయకుండా ముందు అప్పు తీర్చమని చెబుతుంది.
మరోవైపు దీప అత్తయ్యా వాళ్ళు ఈ ఊరిలోనే ఉన్నారనే విషయం డాక్టర్ బాబుకి చెప్పకూడదు అనుకుంటుంది దీప.రుద్రాణి అప్పుతీర్చి ఈ ఊరు దాటాక చెబుతా అనుకుంటుంది.

కార్తీక్ ను హోటల్లో పని చేయమన్న అప్పిగాడిని దీప ఏమిచేసిందంటే..?

మరోవైపు మోనిత ‘ఆనంద రావ్ గురించి తెగ బాధ పడుతూ బాబును ఎత్తుకుని వెళ్లిన అతన్ని వెతకమని బస్తీలో ఉన్న లక్ష్మణ్ కు చెబుతుంది.దీప, కార్తీక్ ఇద్దరూ కూడా అబద్ధాలు చెప్పుకుంటారు. మరో వైపు కార్తీక్ మాత్రం ప్రకృతి ఆశ్రమంకు వెళ్లి అమ్మా నాన్నల గురించి ఆరా తీస్తాడు కానీ ఫలితం ఉండదు. ఇక దీప ఉదయాన్నే వంట చేయడానికి హోటల్‌కి వచ్చి వంట చేసి వెళ్తుంటే అప్పిగాడు వచ్చి అక్కా బావని కూడా మన హోటల్లో పనిలో పెట్టెయ్ ప్లేట్స్ కడుకుగుతూ,క్లీనింగ్ పనులు చూసుకుంటూ ఉంటాడు అని అనడంతో దీపకు కోపం వచ్చి అప్పారావ్ అని గట్టిగా అరుస్తుంది దీప.దీప కోపాన్ని చూసి ‘అయ్యో సారీ అక్కా అని ఓ రోజు నన్ను మీ ఇంటికి భోజనానికి పిలువు అక్కా అంటే సరే అన్న దీప మరి నేను హోటల్‌లో పనిచేస్తున్నానని పిల్లలకి, బావకి చెప్పకూడుదు అంటుంది.

బొంబాయిహోటల్ కి వచ్చిన సౌందర్య, ఆనందరావులు:

మరోపక్క సౌందర్య, ఆనందరావులు సరదాగా ఊరు చూద్దామని ఆశ్రమం నుంచి బయటికి వచ్చి కాఫీ తాగుదామని కార్తీక్ పని చేసే హోటల్ కి వెళతారు.అప్పిగాడు సౌందర్య వాళ్ల దగ్గరకు వెళ్లి ‘ఏం కావాలి’ అని అడగగా కాఫీ అని చెప్పగానే.. ‘బావా రెండు కాఫీ’ అని కార్తీక్ కు చెబుతాడు. సరే కదా అని దీప ఎలా అయితే కాఫీ చేసే పద్దతి చెప్పిందో అలాగే కాఫీ పెడతాడు కార్తీక్.ఇంతలో అప్పిగాడు సౌందర్యతో సరదాగా మాట్లాడుతూ మోనితతో కలిసి దిగిన సెల్ఫిని సౌందర్య, ఆనందరావులకు చూపిస్తాడు. ఆ ఫోటో చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు.బావ త్వరగా కాఫీ తీసుకుని రా అంటే సరిగ్గా అప్పుడే కార్తీక్ ట్రేలో రెండు కాఫీ కప్పులు తీసుకుని రాబోతుంటే హోటల్లో కూర్చున్న అమ్మా నాన్నలను చూసి వెనక్కి వెళ్ళిపోతాడు. ఈలోపు అప్పిగాడు వచ్చి కాఫీ తిసుకుని సౌందర్య వాళ్ళకి ఇస్తాడు. కాఫీ తాగి అక్కడి నుండి హడావుడిగా వెళ్ళిపోతారు.తరువాత కారులో సౌందర్య, ఆనందరావులు వెళ్తూ వెళ్తూ ఆ కాఫీ మన దీప పెట్టినట్లే ఉంది కదా అనుకుంటారు. అక్కడకు వెళ్లి కనుక్కుందాం అనుకుని హోటల్ కి వెళతారు.

మోనిత బాబును ఎత్తుకొచ్చిన రుద్రాణి మనుషులు.

మరోపక్క బాబును పిల్లిగడ్డం రౌడీ రుద్రాణి ఇంటికి ఎత్తుకుని వచ్చి ఊయల్లో వేసి ఊపుతుంటాడు.ఆ విషయం తెలిసి దీప ఆవేశంగా ‘రుద్రాణీ’ ఇంటికి వెళ్లి నీకు డబ్బులు ఇస్తాం అన్నాం కదా మరి ఎందుకు బాబును తీసుకోచ్చావ్ అంటుంది.3 లక్షల 20 వేలకు రెండు రూపాల చొప్పు ఆరు వేల నాలుగు వందలు తెచ్చి ముందు వడ్డీ కట్టి రంగరాజుని తీసుకెళ్లు అంటుంది రుద్రాణి. గట్టిగా మాట్లాడితే నీ పిల్లల్ని కూడా ఎత్తుకుని రమ్మంటా జాగ్రత్తా అని వార్నింగ్ ఇస్తుంది.దాంతో దీప వడ్డీ డబ్బులు ఎలా కట్టాలో అని ఆలోచనలో పడుతుంది.
సౌందర్య, ఆనందరావు తిరిగి హోటల్‌కి వచ్చి ఓనర్ తో ఇక్కడ కాఫీ కలిపింది ఎవరో అని హోటల్. యజమానిని అడగగానే ఆ ఓనర్‌కి దీప అని చెప్పకుండా సాంబయ్య మేడమ్’ అని అబద్ధం చెబుతాడు.దీప ఏమో బాబును తలుచుకుని ఏమి చేయాలో తెలియక ఒంటరిగా ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది.


Share

Related posts

పాపం బండ్ల గ‌ణేష్… ఎంత కామెడీ అయిపోతున్నాడో….

sridhar

Maganti : ప్రాణంతో పోరాడి చివరికి మరణించిన టీడీపీ యువనేత మాగంటి రాంజీ..!!

sekhar

IND v ENG : జట్టులోకి వచ్చేసిన భారత స్టార్ పేసర్ ! షాక్ లో ఇంగ్లాండ్

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar