Bigg Boss Telugu 5: గ్యారెంటీగా అతడే టైటిల్ విన్నర్ అంటున్న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్..!!

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో.. ఇంటిలోకి 19మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా.. ఏడు మంది ఎలిమినేట్ కావటంతో 12 మంది మిగిలారు. ఇంకా ఏడు వారాల గేమ్ ఉండటంతో.. మిగతా ఏడుగురు ఎవరు ఎలిమినేట్ అవుతారు టాప్ ఫైవ్ లో ఎవరు నిలుస్తారు… అనేది ఇప్పుడు బయట పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇటువంటి తరుణంలో బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో… మూడవ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లహరి(Lahari) బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఇస్తున్న ఇంటర్వ్యూలలో… కొత్త కొత్త విషయాలు బయట పెడుతుంది. లహరి మూడవ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

Zombie Reddy actress Lahari in Bigg Boss 5 Telugu house?

ప్రియ ఆంటీ(Priya Aunty) తో… రవికీ రెస్ట్ రూమ్ వద్ద ఇచ్చిన హగ్.. గొడవ తో.. మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో పెద్ద చర్చ జరగగా.. రవి(Ravi) ఇన్ ఫ్లుయాన్స్ కారణంగా ప్రియ ఆంటీ.. లహరి పై దారుణమైన మాటలు అన్నట్టు వీడియో బయటపడటంతో.. అప్పటికే లహరి ఎలిమినేషన్ నామినేషన్ లో… ఉండటంతో మూడవ వారం ఓటింగ్ తక్కువ పడటంతో లహరి(Lahari) ఎలిమినేట్ అయింది. ఇదే తరుణంలో బయటకు వచ్చిన.. లహరి తనకుతానుగా అనేక ఇంటర్వ్యూలు.. సోషల్ మీడియాలో ఇస్తూనే మరోపక్క ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రముఖ ఛానల్స్ లో… తారసపడుతుంది. ఈ విధంగా బిజీ బిజీగా గడుపుతున్న లహరి.. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో… అభిమానుల తో చిట్ చాట్ చేసిన సమయంలో.. సీజన్ ఫైవ్ ట్రోఫీ విజేత ఎవరు అన్నదానిపై.. చాలామంది ప్రశ్నలు వేయడంతో ఎక్కువగా సన్నీ గెలిచే అవకాశాలు ఉన్నాయని.. లహరి జోస్యం చెప్పింది.

Bigg Boss 5 Telugu VJ Sunny: రాగానే అమ్మాయిలతో పులిహోర కలపడం మొదలు పెట్టిన ఆ కంటెస్టెంట్..

సన్నీ కచ్చితంగా సీజన్ ఫైవ్ టైటిల్

టాస్క్ లు… ఇంకా హౌస్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా సన్నీ… తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడని.. ఎక్కువగా అతడి గెలుస్తాడని లేదా షణ్ముఖ్ జస్వంత్ గెలిచే అవకాశాలు ఉన్నాయని.. లహరి సంచలన కామెంట్ చేసింది. తనకి గాని మరోసారి బిగ్ బాస్(Bigg Boss) హౌస్లో అడుగుపెట్టే అవకాశం మళ్ళీ వస్తే గనుక.. తాను మంచి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు.. అభిమానులకు లహరి స్పష్టం చేయడం జరిగింది. ఒక్క లహరి(Lahari) మాత్రమే కాదు చాలామంది ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు తాజాగా పలు ప్రముఖ ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలలో… సన్నీ కచ్చితంగా సీజన్ ఫైవ్ టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువ అని అంటున్నారు. ముఖ్యంగా ఏడో వారం నుండి సన్నీ(Sunny) గేమ్ బాగా చేంజ్ కావడంతోపాటు.. ప్రతి విషయంలో చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వటం.. పట్ల బయట కామన్ ఆడియన్స్ కూడా సన్నీ గేమ్ కి ఫిదా అవుతున్నారు.

Bigg boss 5: Lahari eliminated

ఆల్ రౌండర్ ప్రదర్శన  కనబరుస్తున్నాడు

అదే రీతిలో ఈ వారం కెప్టెన్సీ పరంగా సన్నీ(Sunny).. చాలా అద్భుతంగా జెన్యూన్..గా ఆడుతున్నాడని బెస్ట్ కెప్టెన్ సీజన్ ఫైవ్.. ఖచ్చితంగా సన్నీ.. అంటూ అతడు ఆడుతున్న ఆటతీరుపై బయట జనాలు భారీ ఎత్తున పొగుడుతున్నారు. ఇదే రీతిలో సన్నీ గేమ్ ఆడుతూ ముందుకు పోతే ఖచ్చితంగా సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ అతనిదే అనే టాక్ బయట బలంగా వినబడుతోంది. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఆల్ రౌండర్ ప్రదర్శన సన్నీ కనబరుస్తున్నాడు. హౌస్ లో అన్ని యాంగిల్ పరంగా మాస్క్ లేని గేమ్… ఆడుతూ మరోపక్క.. ఏది ఏమైనా మొహం మీద చెబుతూ.. తనదైన శైలిలో హౌస్ లో దూసుకుపోతున్నాడు.. ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ గెలవడానికి అన్ని అర్హతలు సన్నీకి ఉన్నాయని.. ఏడవ వారం తర్వాత చాలామంది చెబుతున్నారు.


Share

Related posts

అమరావతి : ఆటోమోబైల్ రంగంలో కీలక ముందడుగు – కియో మోటార్స్ తో ఏపీ సర్కార్ ఒప్పందం

Siva Prasad

పాట్నాలో వాజ్‌పేయి విగ్రహం : నితీష్ కుమార్

Siva Prasad

కరోనా సెకండ్ వేవ్ వచ్చింది – ముఖ్యమంత్రి వార్నింగ్ తో ఉలిక్కిపడ్డ రాష్ట్రం !

sridhar