Fire Accident: ఒడిశాలోని పూరిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూరిలోని లక్ష్మీ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు మొత్తం కాంప్లెక్స్ కు విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదం వల్ల దాదాపు 40 కిపై గా దుకాణాలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కాంప్లెక్స్ లో చిక్కుకున్న వంద మందిని రక్షించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించినా ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Enforsment directorate: మీరు చెప్పినట్లుగానే రండి
