అందాల తాక కాజల్ అగర్వాల్ ఇప్పుడు `ఇండియన్ 2`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ 85 ఏళ్ల బామలా కనపడుతుందట. అలాగే ఈ పాత్ర కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. తాజా సమాచారం మేరకు కాజల్ పాత్ర నెగటివ్ టచ్‌తో సాగుతుందట. కమల్ హసన్ పాత్రను ఢీ కొట్టేలా కాజల్ పాత్రను డైరెక్టర్ శంకర్ డిజైన్ చేశారు. దాదాపు 24 సంవత్సరాల క్రితం కమల్, శంకర్ కాంబినేషన్లో రూపొందిన `ఇండియన్` చిత్రానికిది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.
previous post
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!