Hanuman: ఈ ఏడాది సంక్రాంతి పండుగకు “హనుమాన్” సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ₹40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయ్యి 300 కోట్లకు పైగా వసూలను సాధించింది. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని చోట్ల విజయం సాధించింది. చాలా తక్కువ బడ్జెట్ లోనే హై క్వాలిటీ గ్రాఫిక్స్ మరియు విజువల్స్ అద్భుతంగా చూపించడంతో చాలామంది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు దర్శకుడు ప్రశాంత్ వర్మనీ పొగడ్తలతో ముంచేతడం జరిగింది. ఇదిలా ఉంటే “హనుమాన్” సినిమాకి సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే.
సీక్వెల్ లో “హనుమాన్” హీరో గా ఉంటాడని ఆ పాత్రను ఓ స్టార్ హీరో పోషిస్తారని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియజేశారు. దీంతో ఈ పాత్రకు సంబంధించి హీరో రానా పేరుతో పాటు మరి కొంతమంది పేర్లు రావడం జరిగాయి. అయితే ఈ పాత్రకు కన్నడ స్టార్ “కేజిఎఫ్” హీరో యష్ నీ తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారని సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. యష్ కి పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉండటంతో హనుమాన్ సీక్వెల్ కి ఆ ఇమేజ్ బాగా ఉపయోగపడుతుందని ప్లాన్ చేసినట్లు సమాచారం.
పాన్ ఇండియా నేపథ్యంలో “హనుమాన్” భారీ రేంజ్ లో హిట్టు కావడం జరిగింది. సో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా “జై హనుమాన్” కి యష్ అయితే కరెక్ట్ అని డిసైడ్ అయినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా “కేజిఎఫ్” రెండు సినిమాలతో భారీ హిట్ అందుకున్నారు. “కేజిఎఫ్2” అంతర్జాతీయ స్థాయిలో వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీలోనే 500 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. దీంతో “జై హనుమాన్” సినిమాలో హనుమంతుడు పాత్రలో యష్ నీ దర్శకుడు ప్రశాంత వర్మ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!