టాలీవుడ్ యంగ్ హీరో మంచు వారబ్బాయి మనోజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థ ‘ఎమ్ఎమ్ ఆర్ట్స్’ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు మూడేళ్ళుగా మనోజ్ సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడం లేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న మనోజ్ ఈసారి కసితో ఏకంగా పాన్ ఇండియా సినిమానే చేస్తున్నాడు.
ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడు అటు ఇండస్ట్రీ వర్గాలు ఇటు ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. అసలే హిట్స్ లేక ఉన్న మనోజ్ ఏ చిన్న సినిమాని చేసి ముందు ఒక సక్సస్ కొట్టకుండా ఇంత బడ్జెట్ తో ఇలాంటి సబ్జెట్ ఎంచుకున్నాడని అనుకున్నారు. చెప్పాలంటే మనోజ్ ఇంత పెద్ద రిస్క్ ఎందుకు చేస్తున్నాడో కూడా ఎవరీకి అర్థం కాలేదు.
అయితే మనోజ్ మాత్రం తన మీద అలాగే తను ఎంచుకున్న కథ మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకొని ఈ భారీ సినిమాని నిర్మించాలని డిసైడయ్యాడు. అంతేకాదు ఈ సినిమాలో ఉన్న కేవలం ఒక్క ఫైట్ కోసమే 6 కోట్లు ఖర్చు చేస్తున్నాడట. ఇక ఈ ఫైట్ ని ఫేమస్ యాక్షన్ కొరియో గ్రాఫర్ పీటర్ హేయిన్స్ తెరకెక్కిస్తున్నాడు. ఈ ఒక్క ఫైట్ కోసమే మనోజ్ దాదాపు 40 రోజులు కేటాయిస్తున్నాడని సమాచారం. ఇక ఈ ఫైట్ కూడా చాలా రిస్క్ తో కూడుకున్నదని తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జులై నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుకానుందని తాజా సమాచారం. ఇన్ని రిస్కు లు చేస్తున్న మంచు మనోజ్ ఈసారి ఖచ్చితంగా ‘అహం బ్రహ్మాస్మి’తో పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టడమే లక్ష్యం గా పెట్టుకోవడం విశేషం.