NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam February 26 2024 Episode 169: భాగమతికి అన్నం తినిపించిన అమరేంద్ర, పెళ్లి ఎలాగైనా ఆపాలని లేచి కూర్చున్న రామ్మూర్తి.

Nindu Noorella Saavasam Today Episode February 26 2024 Episode 169 Highlights

Nindu Noorella Saavasam February 26 2024 Episode 169:  ఇంకా పడుకోలేదు ఏంటి అని అమరేంద్ర అంటాడు. పడుకుంటానండి అని భాగమతి అంటుంది. ఏమైనా తిన్నావా లేదా  ఉండు అని నీలా ని పిలుస్తాడు అమరేంద్ర. పర్వాలేదండి పడుకుంటాను అని భాగమతి అంటుంది. అన్నం తినకపోతే నిద్ర పట్టదు ఉండు నేనే తీసుకొస్తాను అని అమరేంద్ర వెళ్లి అన్నం తీసుకొస్తాడు. అమరేంద్ర భాగమతికి అన్నం తినిపిస్తాడు. స్పూన్ తో తనకు తినిపించడం రావట్లేదని చెయ్యితో తినిపిస్తూ ఉంటాడు. అన్నం తినిపిస్తున్న అమరేంద్రని అలాగే చూస్తూ ఉంటుంది భాగమతి. అన్నం తినిపిస్తూ ఉండగా పుర మారితే మంచినీళ్లు తాపిస్తాడు అమరేంద్ర. ఇప్పుడు ఓకేనా అని అమరేంద్ర అంటాడు. కట్ చేస్తే, మిస్సమ్మ ఏది నీ చేతులు ఎలా పడ్డాయి చూపించు అని నిర్మల అడుగుతుంది. భాగమతి చేతులు చూపెడుతుంది. ఎంత ఎర్రగా పండాయి అంతకంటే మంచి మొగుడు వస్తాడు అని నిర్మల అంటుంది. భాగమతి తన చేతులు పైకి పెట్టి చూసుకుంటూ ఉండగా చేతుల మధ్యలో నుంచి అమరేంద్ర బయట ఎవరితో మాట్లాడుతూ కనపడతాడు. అమరేంద్ర ని అలాగే చూస్తూ ఉంటుంది భాగమతి.

Nindu Noorella Saavasam Today Episode February 26 2024 Episode 169 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 26 2024 Episode 169 Highlights

అమర్ ఇలా రా అని నిర్మల పిలుస్తుంది. మిస్సమ్మ చేతులు చూడు ఎంత ఎర్రగా పడ్డాయో చూపించు మిస్సమ్మ అని నిర్మల అంటుంది. భాగమతి తన చేతులు చూపెడుతుంది. అది చూసిన అమరేంద్ర షాక్ అయిపోతాడు. మిస్సమ్మ నీ చేతులు ఎంత ఎర్రగా పాండాయి అంతకంటే మంచి మొగుడు వస్తాడు అని రాథోడ్ అంటాడు. అమ్మ గుడికి వెళ్ళాలి కదా రెడీ అవ్వండి అని అమరేంద్ర అంటాడు. మిస్సమ్మ ఈ చీర కట్టుకొని రెడీ అయ్యారా గుడికి వెళ్దాం అని నిర్మల చెబుతుంది. కట్ చేస్తే. మనోహరి మంగళ కి ఫోన్ చేస్తుంది. మేడం చిన్న పాప పెళ్లికి రాకుండా చూసుకోండి అని మంగళ అంటుంది. ఇవన్నీ పనులు చేసే ముందు ఉండాలి అని మనోహరి అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు మేడం అంజలి రాకుండా చూడండి అని మంగళ అంటుంది. పిల్లల సంగతి నేను చూసుకుంటాను మీరైతే త్వరగా వచ్చేయండి అని మనోహని చెబుతుంది.

Nindu Noorella Saavasam Today Episode February 26 2024 Episode 169 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 26 2024 Episode 169 Highlights

ఆ మాటలు వింటాడు అమరేంద్ర. ఎవరితో మాట్లాడుతున్నావు మనోహరి ఎవరి అంతు చూస్తాం అంటున్నావ్ అని అమరేంద్ర అంటాడు. భాగమతి వాళ్ళ పిన్ని తో మాట్లాడుతున్నాను అమర్ పెళ్లి అయిపోయిన తర్వాత నైట్ చిన్న భారత్ ఏర్పాటు చేయమన్నాను కుదరదు అన్నారంట వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని మంగళకి చెబుతున్నాను అంతే అని మనోహరి అంటుంది. అవన్నీ రాథోడ్ చూసుకుంటాడు పద గుడికి వెళ్దాం అని అమరేంద్ర అంటాడు. అమర్ ఇప్పుడు పిల్లలు పెళ్లికి రావడం అవసరం అంటావా ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు అని మనోహరి అంటుంది. పిల్లలు మిస్సమ్మ పెళ్లికి రాకపోతే ఎలా మేడం అయినా ఈరోజు ఆదివారం కదా మేడం అని రాథోడ్ అంటాడు. ఆదివారం అయినా ఇంట్లో ఉండి చదువుకుంటారు కదా స్టడీ డిస్ట్రబ్ అవ్వకూడదు గా అని మనోహరి అంటుంది. ఈ పరిస్థితుల్లో అంజలిని ఒంటరిగా వదిలేయడం నాకు ఇష్టం లేదు మనోహరి ఏం పర్వాలేదు అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 26 2024 Episode 169 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 26 2024 Episode 169 Highlights

ఇప్పుడు ఎలా అంజలి పెళ్లికి రాకూడదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. కట్ చేస్తే,భగవంతుడా ఆ ఖాళీతో నా కూతురు పెళ్లి జరగకూడదు నాకోసం నా కూతురు ఈ పెళ్లి చేసుకుంటుంది నా కూతురు జీవితాంతం పెళ్లి కాకుండా నాతో ఒంటరిగా ఉండిపోయినా పర్వాలేదు కానీ ఆ దుర్మార్గుడితో పెళ్లి జరగకూడదు నేను ఏదో ఒక రకంగా పెళ్లి ఆపాలి లేదంటే నాలాగే నా కూతురు కష్టాల్లో బాధని ఒంటరితనంలో మనశ్శాంతిని పోగొట్టుకొని జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది మంచి వాళ్లకు మంచి జరుగుతుందని అంటారు నా కూతురు పెళ్లి నేనే ఆపాలి ఎవరు వచ్చి ఆపలేరు అని రామ్మూర్తి అనుకుంటాడు. రామ్మూర్తి శతవిధాల ప్రయత్నించి లేసి కూర్చుంటాడు. కట్ చేస్తే,ఏమైందిరాతమ్ముడు ఎందుకు అంత కంగారు పడుతున్నావ్ అని మంగళ అడుగుతుంది. నువ్వు కంగారు పడట్లేదు ఏందని నేను ఆలోచిస్తున్నాను అక్క ఆ అంజలి పెళ్లికి వస్తే పెళ్లి ఆగిపోతుంది బావ వచ్చి నిజం చెప్పిన ఈ పెళ్లి జరగదు వీళ్ళ ఇద్దరికీ నిజం తెలిస్తే మన ముగ్గురిని చంపేస్తారు అని ఖాళీ అంటాడు. చిన్న పాప పెళ్లి కి రాకుండా మనోహరి చూసుకుంటాను అంది కదరా ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ నా టెన్షన్ అంత అది కాదురా మీ బావని పెళ్లికి తీసుకురాలేదని భాగమతి ఎక్కడ గొడవ చేస్తుందో నని నేను టెన్షన్ పడుతున్నాను అని మంగళ అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode February 26 2024 Episode 169 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 26 2024 Episode 169 Highlights

నర్సి ను పెట్టొచ్చామని చెప్పు లేక అని ఖాళీ అంటాడు. ఏదో ఒకటి చెప్పి పెళ్లి జరిపించాలి రా అని మంగళ అంటుంది. కట్ చేస్తే, అమరేంద్ర ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు.  దేవుడా పెళ్లి రోజు రానే వచ్చింది భాగ్యకి నిజం చెప్పలేను తను బాధ పడుతుంటే చూస్తూ ఉండలేను ఇప్పుడు ఎలా అని అరుంధతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ముత్తైదువులు బాగమతిని పెళ్లికూతురు గారు రెడీ చేసి కార్ దగ్గరికి తీసుకు వస్తూ ఉంటారు. ఇంత మంచి అమ్మాయికి ఆ దుర్మార్గుడి  పెళ్లి చేస్తున్నారా ఏదో ఒక విధంగా ఈ పెళ్లి ఆగిపోయేలా చేయి స్వామి అని అరుంధతి అంటుంది. ఫోన్ మాట్లాడుతూ భాగమతిని చూసి కనురెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటాడు అమరేంద్ర. ముత్తైదులు భాగమతిని తీసుకువచ్చి అమరేంద్ర ముందు నిలబెట్టి వెళ్ళిపోతారు. తనను చూసి మొహం పక్కకు తిప్పుకుంటాడు అమరేంద్ర.

Nindu Noorella Saavasam Today Episode February 26 2024 Episode 169 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 26 2024 Episode 169 Highlights

అమర్ మిస్సమ్మ ఎంత అందంగా ఉందో చూడ చక్కగా ఉంది నా దిష్టే తగిలేలా ఉంది అని నిర్మల అంటుంది. అవునమ్మా అని అమరేంద్ర అంటాడు. ఈరోజు కోసమే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను బాగి కి పెళ్లి అయిపోతే ఈ ఇంటి వైపుకు రానివ్వను ఆ తరువాత నా ఫోకస్ అంతా నీ మీద పెడతాను అమర్ అని అనుకుంటుంది మనోహరి.ఇంతలో మనోహరి వచ్చిఅమర్ టైం అవుతుంది బయలుదేరుదామా అని అంటుంది. మనోహరి అమ్మగారు మీరు ఇస్తారు ఆ కారులో రండి అని రాథోడ్ అంటాడు. అమర్ నువ్వు భాగమతి రాథోడ్ ముందు కార్లో వెళ్ళండి పిల్లలని నేను తీసుకొస్తాను అని మనోహరి అంటుంది. పిల్లల్ని అమ్మానాన్న తీసుకొస్తారు మనోహరి నువ్వు కూడా మాతోటే రా అని అమరేంద్ర అంటాడు. నేను పిల్లల్ని తీసుకొని ఏమైనా మర్చిపోయావేమో చూసుకొని వస్తాను మీరు పదండి అని మనోహరి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri